ETV Bharat / bharat

11ఏళ్ల తర్వాత 'పాక్​' చెర నుంచి ఇంటికి...

author img

By

Published : Jan 10, 2021, 7:17 PM IST

Updated : Jan 10, 2021, 7:24 PM IST

Mirzapur man returns home after being jailed in Pakistan for years
11ఏళ్ల తర్వాత 'పాక్​' చెర నుంచి ఇంటికి...

పదకొండేళ్ల క్రితం ఇల్లు వదిలిపోయిన ఓ వ్యక్తి ఎట్టకేలకు సొంతూరు చేరాడు. అనుకోకుండా వెళ్లి పాక్​ జైల్లో 11 ఏళ్లు జీవనం సాగించిన అతడు.. చివరకు మతిస్తిమితం కోల్పోయి ఇంటికి వచ్చాడు. కనీసం సమీప బంధువుల్నీ గుర్తించలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని చూసి.. అతడి సోదరి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

ఉత్తర్​ప్రదేశ్​లో అదృశ్యమైన ఓ వ్యక్తి 11ఏళ్ల తర్వాత సొంతూరికి వచ్చాడు. ఇన్నేళ్లూ పాకిస్థాన్​లో జైల్లో గడిపిన పున్వాసి.. ఎట్టకేలకు మిర్జాపుర్​కు చేరుకున్నాడు. అయితే.. జ్ఞాపకశక్తి మందగించిన అతడు.. కనీసం తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులనూ గుర్తించలేని స్థితిలో ఉండటం.. అక్కడి వారిని కలచివేస్తోంది. ఈ తరుణంలో పున్వాసి మళ్లీ ఇల్లు వదిలి వెళతాడేమోననే భయంతో.. రాత్రంతా అతడికి కాపలాగా ఉందా కుటుంబం.

సోదరి దిగ్భ్రాంతి..

కొత్వాలి ప్రాంతానికి చెందిన పున్వాసి.. 2009లో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. 11 ఏళ్ల పాటు పాక్​ జైల్లోనే నరకం అనుభవించిన అతడు.. ఎట్టకేలకు ఈ నెల 5న ఇంటికి చేరుకున్నాడు. అతడి తల్లిదండ్రులు, ఐదుగురు అన్నదమ్ములు చనిపోయారు. అతడి గుడిసె కూలిపోయింది. ఒక్కగానొక్క సోదరి కిరణ్​ దేవి.. లాల్​గంజ్​ బహుతిలోని వాళ్ల బంధువుల ఇంట్లో ఉంటోంది. తన సోదరుడు వచ్చాడనే వార్త తెలియగానే.. ఎంతో సంతోషించింది. అయితే.. మతిస్తిమితం సరిగాలేని అతడిని కలవగానే ఆ ఆనందం కాస్తా ఆవిరై.. తీవ్ర విచారానికి లోనైందామె.

పున్వాసి మానసిక స్థితికి సంబంధించి చికిత్స చేయించాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆశ్రయించింది అతడి సోదరి.

Mirzapur resident returns home after being jailed in Pakistan for years
పున్వాసి
Mirzapur resident returns home after being jailed in Pakistan for years
పున్వాసితో సోదరి కిరణ్​ దేవి

అలా వెళ్లి.. పాక్​ ​లోకి..

2009 మే 9న ఇల్లు వదిలిన పున్వాసి.. రాజస్థాన్​లోని జోధ్​పుర్​ మీదుగా దేశ సరిహద్దులు దాటి పాక్​లోకి అడుగుపెట్టాడట. వీసా లేకుండా పట్టుబడిన అతడ్ని లాహోర్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదుచేసి జైలుకు పంపారు అక్కడి పోలీసులు.

అడ్రస్​లేక.. ఆలస్యమై!

అయితే.. పున్వాసి చిరునామాకు సంబంధించి సరైన వివరాలు దొరక్క... భారత అధికారులు అతడ్ని రక్షించేందుకు చాలా సమయమే పట్టింది. ఐదేళ్ల క్రితమే అతడి చిరునామా కోసం.. వారణాసి జిల్లా కలెక్టర్​కు ఓ లేఖ రాగా.. అది సరికానిదిగా భావించి వెనక్కిపంపారు. 2019 ఫిబ్రవరి 6న మరోసారి ఆరా తీయగా.. ఎట్టకేలకు గతేడాది అక్టోబర్​ 1న మిర్జాపుర్​లోని అతడి నివాసాన్ని గుర్తించారు అధికారులు. అనంతరం.. నవంబర్​ 17న అతడ్ని భారత్​కు అప్పగించింది పాక్.

ఇదీ చదవండి: గెజిటెడ్ అధికారుల్ని ప్యూన్​లుగా మార్చిన యోగి!

Last Updated :Jan 10, 2021, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.