ETV Bharat / bharat

లిఫ్ట్ ఇచ్చి.. బాలికపై సామూహిక అత్యాచారం

author img

By

Published : Jan 23, 2022, 1:18 PM IST

Gang Rape In Jaipur
అత్యాచారం

Minor Gang Rape In Jaipur: ప్రపంచం ఆధునికత వైపు దూసుకెళ్తున్నా.. మహిళలపై కొందరు మానవ మృగాల వేధింపులు మాత్రం ఆగడం లేదు. రాజస్థాన్​ జైపుర్​లో 13 ఏళ్ల బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Minor Gang Rape In Jaipur: రాజస్థాన్​ జైపుర్​లోని కనోటా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై దుండగులు గ్యాంగ్​రేప్​కు పాల్పడ్డిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్​కు లిఫ్ట్​ ఇస్తానని బైక్​ ఎక్కించుకున్న యువకుడు మరికొందరితో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు పోలీసులు.

'''జనవరి 19న బాలిక సమీపంలోని రింగ్ రోడ్డు ప్రాంతానికి వెళ్లింది. ఆ క్రమంలో లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకున్న ఓ యువకుడు ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడికి మరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ముగ్గురు కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని బెదిరించారు. ఆరు గంటలపాటు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడి యథావిధిగా రింగ్​ రోడ్డు ప్రాంతంలో బాలికను వదిలేసి వెళ్లిపోయారు.''

- పోలీసులు

ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పగా.. భయంతో 3 రోజుల పాటు ఎవరికీ చెప్పలేదని పోలీసులు వివరించారు. దగ్గరి బంధువు ధైర్యం ఇవ్వగా.. బాలిక తల్లి ఆలస్యంగా ఫిర్యాదు చేసిందని వెల్లడించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: మహిళపై దంపతుల అత్యాచారం- వీడియో తీసి బ్లాక్​మెయిల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.