ETV Bharat / bharat

ఆన్​లైన్ మోసం వల్ల రూ.లక్ష ఫట్.. గంటలో డబ్బు తిరిగొచ్చేలా చేసిన పోలీసులు

author img

By

Published : Feb 23, 2023, 6:34 PM IST

MH Dahisar cyber Police recovered Rs 96000 From Fraudsters Account within 1 hours
ఆన్​మోసం వల్ల లక్ష ఫట్..గంటలో బాధితురాలి అకౌంట్​లోకి డబ్బు వచ్చేలా చేసిన పోలీసులు

మనకు ఏదైనా సమాచారం కావాలంటే వెంటనే మనకు గుర్తుకొచ్చేది గూగుల్. దాని సేవలు ప్రపంచమంతా పాకినప్పటికీ దాని ద్వారా చాలా మంది సైబర్​ నేరగాల వలలో పడుతున్నారు. కస్టమర్ నెంబర్ల కోసం గూగుల్​లో వెతికి ఆ ఫేక్ నంబర్లుకు ఫోన్ చేయడం ద్వారా లక్షల రూపాయలను పోగొట్టుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. మరి అలాంటి సంఘటనలే ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చాయి.

ఇన్​స్టాగ్రామ్​ స్నేహితుడైన ఓ వ్యక్తి కొరియర్​ ద్వారా గిఫ్ట్ పంపిస్తానని చెప్పి యువతి దగ్గరి నుంచి రూ.లక్ష కాజేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని దహిసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంటనే చర్యలు తీసుకున్న దహిసర్ సైబర్ పోలీసులు.. ఒక గంటలోనే రూ.96వేలు తిరిగి వచ్చేలా చేశారు.

నిందితుడికి బాధితురాలికి గత ఐదేళ్లుగా ఇన్​స్టాగ్రామ్​ ద్వారా పరిచయం ఉంది. బాధితురాలికి 'ట్రాక్ ఆన్ సర్వీస్' ద్వారా కొరియర్​లో గిఫ్ట్ పంపిస్తానని చెప్పాడు నిందితుడు. కొద్దిరోజులు అయినా కొరియర్ రాకపోయే సరికి గూగుల్​లో కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికారు బాధితురాలు. గూగుల్ సెర్చ్​లో వచ్చిన నెంబర్​కు ఆమె ఫోన్ చేశారు. స్క్రీన్ రికార్డింగ్ చేసే ఎనీడెస్క్ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలని యువతికి కేటుగాడు సూచించారు. రూ.3 పంపితే కొరియర్ వివరాలన్నీ చెబుతానన్నాడు. దీంతో తన తండ్రికి సంబంధించిన అన్ని వివరాలను యువతి పంపారు. వివరాలు సేకరించిన మోసగాళ్లు.. బ్యాంకు ఖాతా నుంచి రూ.99,990 బదిలీ చేసుకున్నాడు. దీంతో తాను మోసపోయినట్లు తెలుసుకున్న బాధితురాలు.. తన తండ్రితో కలిసి బ్యాంక్​ను సంప్రదించారు. ఆ తర్వాత సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల సహాయంతో పోలీసులు లావాదేవీకి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

గంటలో డబ్బు వెనక్కి..
హెచ్​డీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ నోడల్ అధికారులను సంప్రదించిన తర్వాత దహిసర్ సైబర్ పోలీసులు కేవలం 1 గంటలో బాధితురాలి తండ్రి ఖాతాకు రూ.96000 తిరిగి వచ్చేలా చేశారు. తమ డబ్బును తిరిగి పొందిన తర్వాత బాధితురాలు తన ట్విట్టర్ ఖాతాలో పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ దహిసర్ సైబర్ అధికారుల ఫోటోను షేర్ చేశారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్​కు కాల్​ చేయాలని దహిసర్ సైబర్ పోలీస్ కానిస్టేబుల్ దేశ్​పాండే, పీఓ రాథోడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

MH Dahisar cyber Police recovered Rs 96000 From Fraudsters Account within 1 hours
గంటల్ బాధితురాలి అకౌంట్​లోకి డబ్బులు వచ్చేలా చేసిన పోలీసులు

ఇలాంటి మోసమే మరొకటి:
మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లోనూ ఇలాంటి మోసమే బయటపడింది. నోయిడాకు చెందిన ఓ వృద్ధ జంట ఆన్​లైన్​లో డిష్‌వాషర్ కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికి రూ.8.24 లక్షలు పోగొట్టుకుంది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు గురువారం తెలిపారు. వృద్ధ దంపతులు అమర్​జిత్ సింగ్, రాజిందర్ అరోరా.. సెక్టార్ 133లోని ఫామ్‌హౌస్‌లో నివసిస్తున్నారు. జనవరి 22, 23 తేదీల్లో సైబర్ నేరగాళ్లు తమను మోసం చేశారని బుధవారం స్థానిక సెక్టార్ 126 పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

'గూగుల్​లో ఐఎఫ్​బీ డిష్​వాషర్​ కస్టమర్ కేర్ నంబర్​ కోసం వెతికాం. గూగుల్​లో 1800258821 అనే నంబర్​ వచ్చింది. ఆ నంబర్​కు ఫోన్ చేసినప్పుడు ఒక మహిళ ఫోన్ ఎత్తింది. తన సీనియర్ అధికారికి కాల్ కనెక్ట్ చేస్తా అని చెప్పింది. ఆ సీనియర్ ఆఫీసర్ ఆమె ఫోన్​లో ఎనీడెస్క్ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోమని చెప్పాడు. తర్వాత మా లోకేషన్​, యాప్​లో కనిపించే 4డిజిట్ల పిన్ నంబర్​ను అడిగాడు. తమ పిర్యాదును నమోదు చేయడానికి రూ.10 కావాలని చెప్పాడు. ఇది ప్రాసెస్ జరుగుతున్న సమయంలో చాలా సార్లు ఫోన్ మధ్యలో కట్ అయ్యింది. సీనియర్ అధికారి తన వ్యక్తిగత నంబర్ ద్వారా ఫోన్ చేసి ప్రాసెస్​ను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆ నంబర్​కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోంది. సుమారు సాయంత్రం 4.15 గంటల సమయంలో మా జాయింట్ అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్​ఫర్ అయినట్లుగా మెసెజ్ వచ్చింది. మరుసటి రోజు మళ్లీ రూ.5.99లక్షలు డెబిట్ అయినట్లుగా మెసెజ్ వచ్చింది" అని అమర్​జిత్ సింగ్ తెలిపారు.

దంపతులు వెంటనే వారి బ్యాంక్ మేనేజర్​కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి.. తమ ఖాతాను నిలిపివేశారు. జనవరి 22న జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.inకి కూడా ఈ ఘటనపై ఫిర్యాదు చేసినట్లు సింగ్ తెలిపారు. పౌరులు ఏదైనా సైబర్ నేరం గురించి ఫిర్యాదు చేయాలనుకుంటే జాతీయ హెల్ప్‌లైన్ నెంబర్ 1930 లేదా 112కు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నోయిడా, గ్రేటర్ నోయిడా నివాసితులు ఏదైనా సైబర్ నేరాన్ని నివేదించడానికి స్థానిక పోలీసుల ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్ 0121 – 4846100ను కూడా ఉపయోగించవచ్చని సెక్టర్ 126 పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సత్యేంద్ర కుమార్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.