ETV Bharat / bharat

​​మహిళా హాస్టల్ వద్ద​ ఇద్దరు వ్యక్తుల వికృత చేష్టలు.. వీడియో తీసి..!

author img

By

Published : Jan 22, 2022, 5:42 PM IST

Men flash at women hostel inmates: మహిళా హాస్టల్​ వద్ద.. ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన కేరళలోని పతనంతిట్ట నగరంలో జరిగింది. వారి వికృత చేష్టలను వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు హాస్టల్​లోని మహిళలు.

Men flash at women hostel inmates;
వుమెన్స్​​ హాస్టల్ వద్ద​ ఇద్దరు వ్యక్తుల వికృత చేష్టలు

​​మహిళా హాస్టల్ వద్ద​ ఇద్దరు వ్యక్తుల వికృత చేష్టలు

Men flash at women hostel inmates: కామంతో కళ్లు మూసుకుపోయిన ఇద్దరు వ్యక్తులు వుమెన్స్​​ హాస్టల్​ ముందు అసభ్యంగా ప్రవర్తించారు. వారి వికృత చేష్టలను గమనించిన హాస్టల్​లోని మహిళలు వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన కేరళలోని పతనంతిట్ట నగరంలో జరిగింది.

ఇదీ జరిగింది..

నగరంలోని ఓ వుమెన్​ హాస్టల్​ ముందుకు ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళలను చూస్తూ.. అసభ్యంగా ప్రవర్తించారు. వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఓ వ్యక్తి హాస్టల్​ వైపు చూస్తూ.. వికృత చేష్టలు చేసినట్లు వీడియోలో తెలుస్తోంది. బులెట్​ బండిపై ఉన్న మరో వ్యక్తి అలాగే అసభ్యంగా ప్రవర్తించాడు.

హాస్టల్​ ప్రహరీ గోడ.. ఆరు అడుగుల ఎత్తుగా ఉంటుందని తెలిపారు పోలీసులు. కొందరు దుండగులు హాస్టల్​లోని పైఅంతస్థులో ఉన్న అమ్మాయిలను టార్గెట్​ చేస్తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇరువురు దుండగులు మాస్కులు, హెల్మెంట్ ధరించటం వల్ల ముఖాలు సరిగా కనిపించటం లేదని తెలిపారు. వీడియోల్లో వాహనాల నంబర్లు సైతం రికార్డు కాలేదని, ఇద్దరు లుంగీ, షర్టు ధరించినట్లు చెప్పారు.

హాస్టల్​లో ఉండే మహిళలు.. వీడియోలను ముందుగా హాస్టల్​ వార్డెన్​కు చూపించి.. వారి అనుమతి తీసుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: కూతురిపై రేప్​- కోర్టు ఆవరణలోనే నిందితుడిని కాల్చి చంపిన తండ్రి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.