ETV Bharat / bharat

మనీశ్​ తివారీ బుక్​ రిలీజ్​- 26/11 వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ

author img

By

Published : Dec 3, 2021, 4:27 PM IST

Manish Tewari book controversy: "10 ఫ్లాష్​ పాయింట్స్​: 20 ఏళ్లు- భారత్​ను ప్రభావితం చేసిన జాతీయ భద్రతా పరిస్థితులు" పుస్తకాన్ని విడుదల చేశారు కాంగ్రెస్​ నేత మనీశ్​ తివారీ. ఈ సందర్భంగా 26/11 ముంబయి దాడులకు భారత్​ ప్రతిస్పందనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

Manish Tewari
మనీశ్​ తివారీ బుక్​ రిలీజ్

Manish Tewari book controversy: 26/11 ముంబయి ఉగ్రదాడుల తర్వాత భారత స్పందనపై తన పుస్తకంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు కాంగ్రెస్​ నేత, కేంద్ర మాజీ మంత్రి మనీశ్​ తివారీ. పాకిస్థాన్​పై భారత్​ దీటైన చర్యలు తీసుకోవాల్సిందనేది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు.

కొత్త పుస్తకం " 10 ఫ్లాష్​ పాయింట్స్​: 20 ఏళ్లు- భారత్​ను ప్రభావితం చేసిన జాతీయ భద్రతా పరిస్థితులు" విడుదల సందర్భంగా ఈ మేరకు వెల్లడించారు తివారీ.

" మీరు ఆ పేరాను పూర్తిగా చదివితే యూపీఏ ప్రభుత్వం భద్రత విషయంలో ఉదాసీనంగా, బలహీనంగా ఉందనేది ఎక్కడా చెప్పలేదని తెలుస్తుంది. భారత్​ వ్యూహాత్మకంగా సంయమనం పాటించాలని నిర్ణయిస్తే.. అప్పుడు దానిని బలహీనతగా పాకిస్థాన్​ భావిస్తుంది. ఎన్​డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తప్పేమీ కాదు. వారు మరింత చురుకైన విధానాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. సర్జికల్​ స్ట్రైక్స్​ గతంలోనూ జరిగాయి. కానీ, వాటిని నిర్వహించే ఆలోచన కొత్తది. పాకిస్థాన్​ ప్రవర్తనను మార్చటం ఇక్కడ అంశం. ఉరీ, బాలాకోట్​ దాడులు పాకిస్థాన్​ ప్రవర్తనను మార్చాయా? అంటే కాదనే సమాధానం వినిపిస్తుంది. ఉరీ సర్జికల్​ స్ట్రైక్స్​ తర్వాత తన ప్రవర్తనను పాకిస్థాన్​ మార్చుకుంది అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఉరీ దాడి తర్వాత పుల్వామా దాడులు జరిగాయనేది గుర్తుంచుకోవాలి."

- మనీశ్​ తివారీ, కాంగ్రెస్​ నేత

తన పుస్తకంలోని కొన్ని అంశాలను మనీశ్​ తివారీ విడుదలకు ముందే ట్విట్టర్​ వేదికగా షేర్ చేసిన క్రమంలో రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగింది. 'వందలాది మంది అమాయకులను అత్యంత క్రూరంగా హతమార్చిన సందర్భంలో సహనంతో ఉండడమనేది బలానికి సంకేతం కాదు. అది కచ్చితంగా బలహీనతకు సంకేతమే.. కొన్ని సందర్భాల్లో మాటలకంటే చేతలతోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 26/11 దాడుల ఘటన కూడా అటువంటి సమయమే కాబట్టి, ఆ సమయంలో భారత్‌ ప్రతిస్పందన మరింత బలంగా ఉండాల్సింది.' అని పేర్కొన్నారు.

మరోవైపు.. బుక్​ విడుదల సందర్భంగా భారత్​లోకి చైనా చొరబాట్లను ఉద్దేశిస్తూ భాజపాపై విమర్శలు గుప్పించారు తివారీ. చైనా చొరబాట్లపై పార్లమెంట్​లో అడిగిన ప్రతి అంశాన్ని జాతీయ భద్రత పేరుతో తిరస్కరించారని ఆరోపించారు.

పుస్తకం విడుదల కార్యక్రమంలో జీ23 నేతలు భూపిందర్​ హుడా, ఆనంద్​ శర్మ పాల్గొన్నారు. 26/11 అటాక్​ సమయంలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సరైనవని పేర్కొన్నారు ఆనంద్​ శర్మ.

ఇదీ చూడండి: 'యూపీఏ అసమర్థ పాలన.. ఆ బుక్​తో విస్పష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.