ETV Bharat / bharat

8 ఏళ్ల చిన్నారిపై దారుణం.. హత్యాచారం తర్వాత శరీరాన్ని ముక్కలుగా నరికి..

author img

By

Published : Apr 2, 2023, 10:59 PM IST

చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. శరీరాన్ని ముక్కలుగా నరికాడు. అనంతరం ఆ భాగాలను ఓ ఖాళీ ప్రదేశంలో పడేశాడు. రాజస్థాన్​లో ఈ ఘటన జరిగింది.

man raped 8 year old girl and killed chapped body into pieces
8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు ఓ కామాంధుడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. వాటిని ఓ ఖాళీ ప్రదేశంలో పడేశాడు. ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. రాజస్థాన్​లో ఈ దారుణం జరిగింది. కమలేశ్​ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 26న ఈ ఘటన జరిగింది. నిందితుడు ఆ రోజు రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఇంటి పక్కనే చిన్నారి ఆడుకుంటోంది. చిన్నారి తల్లిదండ్రులు కూడా ఇంట్లో లేరు. అదే అదునుగా భావించిన నిందితుడు చిన్నారిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. అనంతరం ఆమెపై ఈ ఘోరానికి పాల్పడ్డాడు. చిన్నారి శరీర భాగాలను ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశంలో పడేశాడు.

పని ముగించుకుని ఇంటికొచ్చిన చిన్నారి తల్లిదండ్రులు.. పాప కనిపించకపోవటం పట్ల ఆందోళనలు గురయ్యారు. నాలుగు రోజుల పాటు పాపను తీవ్రంగా వెతికారు. ఎంతకీ పాప ఆచూకీ లభించని కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాప కోసం తీవ్రంగా గాలించారు. కాగా ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశంలో శరీర భాగాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శవ పరీక్షల నిమ్మితం వాటిని ఆసుపత్రికి పంపించారు. "శవ పరీక్షల్లో శరీర భాగాలు చిన్నారివేనని గుర్తించాం. ఆమెపై అత్యాచారం జరిగిందని పరీక్షల్లో తేలింది. కమలేశ్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. నిందితుడు పాఠశాల చదువును మధ్యలోనే ఆపేశాడు" అని పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఛార్జ్​షీట్ నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.

మత్తుమందు ఇచ్చి విద్యార్థినిపై గ్యాంగ్​రేప్​..
కొద్ది రోజుల క్రితం దిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. బాధితురాలు చదువుతున్న పాఠశాల అటెండర్​, అతడి సహచరులతో కలసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. దిల్లీలోని మున్సిపల్​ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో గత పదేళ్లుగా అజయ్(54) అనే వ్యక్తి అటెండర్​గా పనిచేస్తున్నాడు. అయితే మార్చి 14న బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు అజయ్​. మత్తుమందు ఇచ్చి.. తన ముగ్గురు సహచరులతో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడే వదిలేసి పరారయ్యాడు. బాధితురాలు స్కూల్​కు రాకపోవడం గురించి.. ఆమె టీచర్​ ఆరా తీసింది. బాధితురాలి సోదరుడు.. బాలికకు ఆరోగ్యం బాగోలేదని టీచర్​కు తెలిపాడు. దీంతో బాలిక తల్లిని సంప్రదించింది ఉపాధ్యాయురాలు. విషయం వెలుగులోకి వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.