ETV Bharat / bharat

దారుణం.. లిఫ్ట్​లో తల ఇరుక్కొని వ్యక్తి దుర్మరణం

author img

By

Published : May 11, 2022, 8:04 AM IST

Head Stuck in Lift: లిఫ్ట్​లో తల ఇరుక్కొని ఓ వ్యక్తి మరణించిన ఘటన కేరళ తిరువనంతపురంలో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా.. అతడిని కాపాడలేకపోయారు.

Head Stuck in Lift: కేరళలో విషాదం జరిగింది. కార్గో లిఫ్ట్​లో తల ఇరుక్కొని.. ఓ 54 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అంబలాముక్కు ప్రాంతంలోని శానిటరీ ఉత్పత్తులు విక్రయించే ఓ షోరూంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మృతుడిని నీమమ్​ జిల్లాకు చెందిన సతీశ్​గా గుర్తించారు. అతడు గత 18 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నట్లు తెలిసింది.
ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనా స్థలానికి వేగంగా చేరుకున్నా.. అతడిని కాపాడలేకపోయారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. సతీశ్​కు భార్య, ఓ కుమార్తె ఉన్నారు.

ఇవీ చూడండి: టాయిలెట్ లేదని పెళ్లైన రెండో రోజే పుట్టింటికి మహిళ.. భర్త తిట్టాడని ఆత్మహత్య

కన్నకూతురిపై అత్యాచారం.. నిందితుడికి 106 ఏళ్ల జైలుశిక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.