టాయిలెట్ లేదని పెళ్లైన రెండో రోజే పుట్టింటికి మహిళ.. భర్త తిట్టాడని ఆత్మహత్య

author img

By

Published : May 10, 2022, 8:11 PM IST

women commits suicide

No Toilet Woman suicide: భర్త ఇంట్లో టాయిలెట్ లేకపోవడం.. ఓ మహిళ ప్రాణాలు పోవడానికి కారణమైంది. టాయిలెట్ లేదన్న కారణంతో పుట్టింటికి వెళ్లిపోయిన ఓ మహిళ.. భర్త తనతో గొడవపెట్టుకున్నాడని ఆత్మహత్య చేసుకుంది.

No Toilet Bride suicide: అత్తవారింట్లో టాయిలెట్ లేదని మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో జరిగింది. అరిసిపెరియంగుప్పం గ్రామానికి చెందిన రమ్య(27).. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. అదే జిల్లాలోని పుథునగర్​కు చెందిన కార్తికేయన్​తో ప్రేమలో పడింది. ఏప్రిల్ 6న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే, భర్త ఇంటికి వెళ్లిన రమ్యకు ఒక్కసారిగా ఊహించని పరిణామం ఎదురైంది. అతడి ఇంట్లో టాయిలెట్ లేదని తెలిసింది. దీంతో ఆత్మాభిమానాన్ని చంపుకోలేక.. తర్వాతి రోజే పుట్టింటికి వచ్చేసింది. తన భర్త టాయిలెట్ కట్టిస్తాడని ఆశపడింది. కానీ, అలా జరగలేదు. పరిస్థితి మరింత క్షీణించింది.

women commits suicide
రమ్య, కార్తికేయన్

టాయిలెట్ నిర్మించడం అటుంచితే.. కార్తికేయన్ ఈ విషయంలో రమ్యతో గొడవపడ్డాడు. ఓ దశలో ఆమెను దుర్భాషలాడాడు. దీంతో రమ్య కలత చెందింది. భర్తతో సాన్నిహిత్యం దెబ్బతినేసరికి మరింత కుంగిపోయింది. ఈ క్రమంలోనే ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉరితాడుకు వేలాడుతూ కనిపించిన రమ్యను ఆమె తల్లి మంజుల గమనించింది. పొరుగువారి సాయంతో ఆమెను కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి పుదుచ్చేరిలోని జిప్​మర్ ఆస్పత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలవలేదు.

women commits suicide
రమ్య

కాగా, ఈ ఘటనపై రమ్య తల్లి మంజుల పోలీసులను ఆశ్రయించింది. కార్తికేయన్ తీరు వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని మంజుల ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కడలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి అదియమన్ కావియార్సన్ సైతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి:

పంచాయతీ భవనాన్ని కూల్చి.. శిథిలాలు అమ్మేసుకున్న గ్రామపెద్ద

హైదరాబాద్​లో ఉగ్రవాదుల రెక్కీ... ఆ​ రైల్వే స్టేషన్​లో బాంబులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.