ETV Bharat / bharat

'బహిష్కరణ వేటు 'కంగారూ కోర్టు' ఉరి తీర్పుతో సమానం- విపక్షాలను లొంగదీసుకోవడానికే ఎథిక్స్ కమిటీ'

author img

By PTI

Published : Dec 8, 2023, 4:27 PM IST

Updated : Dec 8, 2023, 6:19 PM IST

Mahua Moitra Expelled From Lok Sabha : విపక్షాలను లొంగదీసుకోవడానికే కేంద్రం లోక్​సభ ఎథిక్స్ కమిటీని ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపించారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. లోక్​సభ నుంచి బహిష్కరణకు గురైన అనంతరం ఆమె కేంద్రంపై తీవ్రంగా విమర్శలు చేశారు.

Mahua Moitra Expelled From Lok Sabha
Mahua Moitra Expelled From Lok Sabha

Mahua Moitra Expelled From Lok Sabha : లోక్​సభ నుంచి తనను బహిష్కరించడంపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా మండిపడ్డారు. తన బహిష్కరణను కంగారూ కోర్టు(పెద్ద మనుషుల పంచాయతీ) ఉరి తీయమని ఇచ్చిన తీర్పుతో సమానమని విమర్శించారు. విపక్షాలను లొంగదీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లోక్​సభ ఎథిక్స్ కమిటీని ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపించారు.

  • #WATCH | Mahua Moitra on her expulsion as a Member of the Lok Sabha says, "...If this Modi government thought that by shutting me up they could do away with the Adani issue, let me tell you this that this kangaroo court has only shown to all of India that the haste and the abuse… pic.twitter.com/DKBnnO4Q0d

    — ANI (@ANI) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

లోక్​సభ ఎథిక్స్ కమిటీ ప్రతి నిబంధనను ఉల్లంఘించిందని బహిష్కరణకు గురైన ఎంపీ మహువా మొయిత్రా విమర్శించారు. 'ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఇద్దరు వ్యక్తులు చెప్పిన మాటలను నమ్మి నన్ను దోషిగా నిర్ధారించారు. ఇక, రేపు మా ఇంటికి సీబీఐని పంపించి నన్ను వేధిస్తారేమో' అని మహువా మండిపడ్డారు.

  • #WATCH | Mahua Moitra on her expulsion as a Member of the Lok Sabha says, "...If this Modi government thought that by shutting me up they could do away with the Adani issue, let me tell you this that this kangaroo court has only shown to all of India that the haste and the abuse… pic.twitter.com/DKBnnO4Q0d

    — ANI (@ANI) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"డబ్బులు, కానుకలు తీసుకున్నట్లు ఎక్కడా లేదు. నా లోక్‌సభ పోర్టల్‌ లాగిన్‌ ఇతరులకు ఇచ్చారనే అభియోగాలతో బహిష్కరణకు సిఫార్సు చేశారు. ఏమైనప్పటికీ లాగిన్‌ ఇతరులకు ఇచ్చే విషయమై ఎలాంటి నిబంధనలు లేవని విచారణ సందర్భంగా నైతిక విలువల కమిటీ చెప్పింది. దీంతో ప్రజల సమస్యలను తెలుసుకొని పార్లమెంటు లేవనెత్తే విషయమై ఎంపీలందరికీ హెచ్చరిక చేశారు. నా నోరు మూయించటం ద్వారా అదానీ అంశాన్ని దారి మళ్లించవచ్చని మోదీ ప్రభుత్వం అనుకుంటోంది. ఈ వ్యవహారంలో త్వరితగతిన చేపట్టిన విచారణ ప్రక్రియ, దుర్వినియోగం అదానీ వారికి ఎంత ముఖ్యమో ఈ కంగారూ కోర్టు దేశం మొత్తానికి చూపించింది. నా నోరు మూయించి ఒంటరి మహిళా ఎంపీని వేధించడానికి మీరు ఎంతవరకు వెళ్తారు. రేపు సీబీఐని మా ఇంటికి పంపుతారని నాకు తెలుసు. వచ్చే 6నెలలపాటు నన్ను వేధిస్తారు."

-మహువా మొయిత్రా, బహిష్కరణకు గురైన ఎంపీ

మరోవైపు, అదానీ వ్యవహారంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై మహువా మొయిత్రా మండిపడ్డారు. '13వేల కోట్ల బొగ్గు కుంభకోణం సంగతేమిటీ? అదానీ విషయాన్ని సీబీఐ, ఈడీ ఎందుకు పట్టించుకోవటం లేదు. పోర్టల్‌ లాగిన్‌ పంచుకోవటం ద్వారా జాతీయ భద్రతతో రాజీపడ్డానా మీరు చెప్పండి? అదానీ అన్ని పోర్టులను, విమానాశ్రయాలను కొనుగోలు చేస్తున్నారు. దేశంలోని మౌలిక సదుపాయాలను కొనుగోలు చేసేందుకు అతని వాటాదారులు, ఎఫ్‌ఎఫ్‌ఐలకు విదేశీ వ్యవహారాల శాఖ క్లియరెన్స్‌ ఇస్తోందా? మీకు మైనార్టీలు, మహిళలు అంటే ద్వేషం. నారీశక్తిని ద్వేషిస్తున్నారు. 49ఏళ్ల వయసున్న నేను వచ్చే 30ఏళ్లు పార్లమెంటు లోపల, బయట పోరాటం చేస్తూనే ఉంటా' అని మహువా ఆరోపించారు.

  • VIDEO | "I am 49 years old, I will fight you for the next 30 years inside Parliament, outside Parliament," says TMC leader @MahuaMoitra after Lok Sabha expelled her from the House, adopting Ethics Committee recommendation in 'cash-for-query' matter.

    Earlier, Opposition members… pic.twitter.com/xprZDxKIW2

    — Press Trust of India (@PTI_News) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేంద్రంపై మమత ఫైర్​
లోక్​సభ నుంచి టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరించడంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. మహువా బహిష్కరణను పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి చేసిన ద్రోహంగా అభివర్ణించారు. టీఎంసీ పార్టీ మహువా మొయిత్రాకు అండగా ఉంటుందని మమత తెలిపారు.

  • #WATCH | TMC chairperson Mamata Banerjee on the expulsion of Mahua Moitra from Lok Sabha

    " Today, I am sad to see the attitude of the BJP party...How they betray democracy...They didn't allow Mahua to explain her stand. Full injustice has been done. " pic.twitter.com/ljCkLHwlHk

    — ANI (@ANI) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'మహువా మొయిత్రా బహిష్కరణ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అవమానం. మహువాను బహిష్కరించిన విధానాన్ని ఖండిస్తున్నాం. ఎన్నికల్లో టీఎంసీని ఓడించలేమని బీజేపీ ప్రతీకార రాజకీయాలకు దిగింది. మహువా మొయిత్రా తన వాదనను లోక్​సభలో వినిపించడానికి కూడా ప్రభుత్వం అనుమతించలేదు. పార్లమెంట్​లో బీజేపీకి ప్రస్తుతం సంపూర్ణ మెజారిటీ ఉందని ఏమైనా విపక్షాలను ఏమైనా చేయగలమని భావిస్తోంది. వారుకూడా అధికారంలో లేని రోజు వస్తుందని గుర్తుంచుకోవాలి' అని మమతా బెనర్జీ తెలిపారు.

  • #WATCH | "This is vendetta politics of BJP. They killed democracy....It is injustice. Mahua will win the battle. The people will give justice. They (BJP) will be defeated in the next election," says TMC chairperson Mamata Banerjee. pic.twitter.com/Y88F8YhNwK

    — ANI (@ANI) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే'
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కొత్త పార్లమెంట్ భవనంలో కొత్త నిబంధనలు పెట్టారని విమర్శించింది. నిరాధారమైన ఆరోపణలతో, ప్రతీకార భావనతో మహువాపై కేంద్రం చర్యలు తీసుకుందని కాంగ్రెస్ ఎంపీ అదీర్ రంజన్ చౌదరి విమర్శించారు. 'ప్రజాస్వామ్యానికి ఈ రోజు చీకటి రోజు. వ్యాపారవేత్త అదానీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా వారి నోరు మూయిస్తారు. అందుకే మహువా మొయిత్రా బహిష్కరణే ఉదాహరణ. మహువా మొయిత్రాను పార్లమెంటులో మాట్లాడనివ్వలేదు. మహువా మొయిత్రాపై వేటు ప్రణాళికబద్ధమైన కుట్ర. ప్రజాస్వామ్యంలో ఈ రోజు బ్లాక్ డే.' అని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ అన్నారు.

  • #WATCH | On Mahua Moitra's expulsion as TMC MP, Congress MP Adhir Ranjan Chowdhury says, "This was done based on baseless facts and with a sentiment of revenge." pic.twitter.com/4boxeOZMfC

    — ANI (@ANI) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | On Mahua Moitra's expulsion as TMC MP, Congress MP Manickam Tagore says, " New Parliament and new rules. Whoever speaks against Adani, they will be silenced, Mahua Moitra is a perfect example of this. She was not allowed to speak at all in Parliament...she was not given… pic.twitter.com/YSGJdCzqMj

    — ANI (@ANI) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'దేశ భద్రత విషయంలో రాజకీయాలు ఉండకూడదు'
మహువా మొయిత్రాను లోక్​సభ నుంచి బహిష్కరించడంపై బీజేపీ స్పందించింది. దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజకీయాలు ఉండకూడదని బీజేపీ ఎంపీ లాకేఠ్ ఛటర్జీ తెలిపారు. అవినీతికి పాల్పడిన వారు కటకటాల వెనుకకు పంపిస్తామని ప్రధాని మోదీ ప్రజలకు హామీ ఇచ్చారని అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా. ఇండియా కూటమి దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని, దేశ ప్రజల హక్కులను చెదపురుగులా తినేస్తోంది. కాంగ్రెస్, టీఎంసి, ఆప్ పార్టీలు ఎందుకు అవినీతిలో భాగమయ్యాయని ప్రశ్నించారు.

  • #WATCH | Delhi: BJP national spokesperson Gaurav Bhatia says, "It's PM Modi's guarantee to not let the corruption flourish and those who have done corruption have to rot behind bars. Those people have to repay every single penny they have looted from the public. Why is the INDIA… pic.twitter.com/8XOZg4UJxp

    — ANI (@ANI) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎవరీ మహువా మొయిత్రా? ఆమెను లోక్​సభ నుంచి ఎందుకు బహిష్కరించారు?

టీఎంసీ ఎంపీ మహువాపై బహిష్కరణ వేటు- లోక్​సభ నుంచి విపక్షాలు వాకౌట్

Last Updated : Dec 8, 2023, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.