ETV Bharat / bharat

షోరూమ్​లో రైతుకు అవమానం- మహీంద్రా సీరియస్!

author img

By

Published : Jan 26, 2022, 10:54 AM IST

Mahindra salesman mocks farmer
రైతుకు అవమానంపై ఆనంద్ మహీంద్రా ట్వీట్

Mahindra salesman mocks farmer: కర్ణాటకలోని మహీంద్రా షోరూమ్​లో రైతుకు జరిగిన అవమానంపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. వ్యక్తిగత గౌరవాన్ని కాపాడటమే తమ సంస్థ విలువైన సంపద అని చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Mahindra salesman mocks farmer: కర్ణాటక తుముకూరులోని మహీంద్రా షోరూమ్​లో ఓ రైతుకు జరిగిన అవమానంపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. తమ సంస్థ వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుతుందని, ఇలాంటి ఘటనలను అత్యవసరమైనవిగా భావించి పరిష్కరిస్తామన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

"మహీంద్రా.. తమ ప్రజలు, పెట్టుబడిదారులకు శక్తినిచ్చేలా తోడ్పడుతుంది. వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుతుంది. ఇలాంటి వాటికి ఏమైనా ఇబ్బంది జరిగితే అత్యవసరంగా పరిష్కరిస్తాం." అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఏం జరిగింది?

కర్ణాటక, తుముకూర్​లోని ఓ మహీంద్రా కార్ల షోరూమ్​కు కెంపెగౌడ అనే రైతు తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్​ ట్రక్కు కొనేందుకు వెళ్లారు. లోపలకు వెళ్లిన క్రమంలో వారి వస్త్రాలంకరణను హేళన చేస్తూ అక్కడి సేల్స్​మ్యాన్​ అవమానించాడు. కారు ధర మీరనుకున్నట్లు రూ.10 కాదంటూ వారిని తక్కువ చేసి మాట్లాడాడు. ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న ఒకరు రికార్డు చేశారు. రైతును ఉద్దేశిస్తూ సేల్స్​మ్యాన్ అసభ్యకరంగా​ మాట్లాడుతున్నట్లు వీడియోలో ఉంది.

" షోరూమ్​కు వెళ్లగా మాతో సేల్స్​మ్యాన్​ అవమానకరంగా మాట్లాడాడు. రూ.10కి వచ్చే కారు కాదంటూ హేళన చేశాడు. కారు కొనేందుకు ఇంత మంది రారని మా స్నేహితులను ఉద్దేశించి మాట్లాడాడు."

- కెంపెగౌడ, రైతు

గంటలో రూ.10 లక్షలు..

తమ వస్త్రధారణ చూసి అవమానించిన సేల్స్​మ్యాన్​కు రైతు.. ధీటైన సమాధానమిచ్చారు. గంటలో రూ.10 లక్షలు తీసుకొచ్చి వెంటనే కారు డెలివరీ చేయాలని డిమాండ్​ చేశారు. రైతు చేసిన ప్రతీకార చర్యతో షాక్​కు గురైన షోరూమ్​ సిబ్బంది.. మూడు రోజుల్లో కారు డెలివరీ చేస్తామని రైతుకు, ఆయన స్నేహితులకు తెలిపారు.అక్కడి నుంచి వెళ్లిన రైతు.. తుముకూర్​లోని తిలక్​నగర్​ పోలీస్​ స్టేషన్​లో షోరూమ్​ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. చివరకు షోరూమ్​ సేల్స్​మ్యాన్​, ఇతర ఉద్యోగులు కెంపెగౌడకు క్షమాపణలు చెప్పారు. రాతపూర్వక క్షమాపణ పత్రాన్ని అందించారు. అనంతరం ఇరువర్గాలతో మాట్లాడిన పోలీసులు.. వివాదానికి ముగింపు పలికారు.

ఆ రోజు షోరూమ్​లో జరిగిన ఘటన వివరాల కోసం ఈ వీడియో చూడండి..

రైతుకు అవమానంపై ఆనంద్ మహీంద్రా ట్వీట్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.