ETV Bharat / bharat

'మహా' కరోనా కేసుల్లో సరికొత్త రికార్డు

author img

By

Published : Mar 24, 2021, 9:24 PM IST

దేశంలో కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 31 వేల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు. మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. మరోవైపు గుజరాత్​, దిల్లీ, మధ్యప్రదేశ్​లోనూ వైరస్​ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

Maharashtra reports 31,855 new COVID-19 cases, its   highest single-day spike since the outbreak of the pandemic:    Health official.
మహమ్మారి పంజా.. 'మహా'లో రికార్డు స్థాయి కేసులు

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మహారాష్ట్రలో కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. బుధవారం కొత్తగా 31 వేల 855 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటినుంచి ఆ రాష్ట్రంలో నమోదైన రోజువారి కేసుల్లో ఇవే అత్యధికం. వైరస్ ధాటికి మరో 95 మంది ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో కేసులు..

  • మొత్తం కేసులు: 25,64,881
  • మొత్తం రికవరీలు: 22,62,593
  • మొత్తం మరణాలు: 53,684
  • యాక్టివ్​ కేసులు: 2,47,299

ముంబయిలో కేసులు..

మహారాష్ట్రలోని ముంబయి నగరంలో 5,185 మందికి తాజాగా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో ఆరుగురు వైరస్​కు బలయ్యారు.

  • మొత్తం కేసులు: 3,74,611
  • మొత్తం రికవరీలు: 3,31,322
  • మొత్తం మరణాలు: 11,606
  • యాక్టివ్​ కేసులు: 30,760

దిల్లీలో కేసులు..

దిల్లీలో కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 1,254 మందికి వైరస్​ సోకింది. మరో ఆరుగురు మృతి చెందారు.

  • మొత్తం కేసులు: 6,51,227
  • మొత్తం రికవరీలు: 6,35,364
  • మొత్తం మరణాలు: 10,973
  • యాక్టివ్​ కేసులు: 4890

గుజరాత్​లో కేసులు..

గుజరాత్​లో కొత్తగా 1,790 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 2,92,169
  • మొత్తం రికవరీలు: 2,78,880
  • మొత్తం మరణాలు: 4,466
  • యాక్టివ్​ కేసులు: 8,823

మధ్యప్రదేశ్​లో కేసులు..

మధ్యప్రదేశ్​లో బుధవారం కొత్తగా 1,712 మంది కరోనా బారిన పడ్డారు. మరో ఏడుగురు మరణించారు.

  • మొత్తం కేసులు: 2,80,289
  • మొత్తం రికవరీలు: 2,66,323
  • మొత్తం మరణాలు: 3,919
  • యాక్టివ్​ కేసులు: 10,047

దేశంలో కొత్తగా 47,262 మందికి వైరస్​​ సోకింది. మరో 275 మంది చనిపోయారు.

ఇదీ చూడండి:కరోనా పంజా: భారత్​లో మరో కొత్త వేరియంట్​​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.