ETV Bharat / bharat

'వైరస్ ఉద్ధృతి ఇలాగే ఉంటే లాక్​డౌన్​ను​ తోసిపుచ్చలేం'

author img

By

Published : Apr 2, 2021, 8:57 PM IST

cm thackeray
'వైరస్ ఉద్ధృతి ఇలాగే ఉంటే లాక్​డౌన్​ తోసిపుచ్చలేం'

మహారాష్ట్రలో వైరస్​ వ్యాప్తి ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే లాక్​డౌన్​ను తోసిపుచ్చలేమని అన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.

ప్రస్తుతం ఉన్నట్లుగానే మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి కొనసాగితే లాక్​డౌన్​ విధించక తప్పదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. రానున్న రోజుల్లో మహారాష్ట్రలో రోజుకు 2.5 లక్షల ఆర్​టీ పీసీఆర్​ టెస్టులు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 65 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు పేర్కొన్న సీఎం.. గురువారం ఒక్కరోజే 3 లక్షల మందికి టీకా వేసినట్లు చెప్పారు. మాస్కు ధరించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారికి టీకా తీసుకున్నాక కూడా వైరస్​ సోకుతుందని అన్నారు.

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు ఉద్ధవ్ ఠాక్రే.

ఇదీ చదవండి:టికాయిత్​ కాన్వాయ్​పై దుండుగుల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.