ETV Bharat / bharat

16 ఏళ్ల బాలికపై గ్యాంగ్​ రేప్​.. ఫ్రెండ్​కు లైవ్​ స్ట్రీమ్​ పెట్టిన దుండగులు

author img

By

Published : Jun 11, 2022, 6:51 PM IST

Updated : Jun 12, 2022, 9:10 AM IST

minor rape mp: 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. అక్కడితో ఆగకుండా ఆ దారుణాన్ని వారి స్నేహితుడికి లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన మరో ఘటన.. 6 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు.

rape
అత్యాచారం

minor rape mp: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. అంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని వారి స్నేహితుడికి లైవ్​ స్ట్రీమింగ్​ చేశారు. ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. జున్​2వ తేదీన 21 ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులు తనను హోటల్​కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటం వల్ల ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది.

" నిందితులు వారి దుశ్చర్యను స్నేహితుడికి లైవ్​ స్ట్రీమింగ్​ చేశారు. ఫొటోలు, వీడియోలు తీశారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలోనూ షేర్ చేశారు. వారు ఇంతకుముందు కూడా ఇలాంటి నేరానికి పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం. వారిని పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నాం.

- పోలీసులు

నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి: ఉత్తర్​ప్రదేశ్​, కౌశాంబిలో దారుణం జరిగింది. 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన గత శుక్రవారం జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి.. శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ధీరేంద్ర(25).. బాధితురాలి గ్రామానికి చెందిన వాడే. బాలిక ఇంట్లో విహహ కార్యక్రమం జరగడం వల్ల కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారు. ఇదే అదునుగా చూసుకుని నిందితుడు శుక్రవారం అర్ధరాత్రి తన ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాసేపటికి బాలిక ఆచూకీ కనిపించకపోవడం వల్ల కుటుంబ సభ్యులు వెతికారు. అప్పటికే బాలిక నిర్మానుష్య ప్రదేశంలో అపస్మారక స్థితిలో కనిపించింది.

మైనర్ నిద్రిస్తుండగా: ఉత్తర్​ప్రదేశ్​లోనే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. తొమ్మిదేళ్ల బాలిక​పై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ 16 ఏళ్ల బాలుడు. బాధితురాలు​ శుక్రవారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా.. నిందితుడు ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి: బాయ్​ఫ్రెండ్​ కోసం పెద్ద రిస్క్​.. ఐఏఎస్​ ఆశలు ఆవిరి.. మూడో అంతస్తు నుంచి పడి..

అన్న మర్డర్​కు ముగ్గురు ప్లాన్​.. తర్వాత రోజే చెల్లెలు సూసైడ్​.. ఏం జరిగింది?

Last Updated : Jun 12, 2022, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.