బాయ్​ఫ్రెండ్​ కోసం పెద్ద రిస్క్​.. ఐఏఎస్​ ఆశలు ఆవిరి.. మూడో అంతస్తు నుంచి పడి..

author img

By

Published : Jun 11, 2022, 1:11 PM IST

Updated : Jun 11, 2022, 1:57 PM IST

chennai latest news

బాయ్​ఫ్రెండ్​ను కలుసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది యూపీఎస్సీకి ప్రిపేర్​ అవుతున్న ఓ యువతి. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.

తన ఇంట్లో ఉన్న బాయ్​ఫ్రెండ్​ను కలుసుకునే ప్రయత్నంలో మూడో అంతస్తు నుంచి పడిపోయి సివిల్స్​కు సన్నద్ధమవుతున్న ఓ విద్యార్థిని​ చనిపోయింది. తమిళనాడులోని చెన్నైలో ఈ విషాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె బాయ్​ఫ్రెండ్​ను ప్రశ్నించడం సహా దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఇదీ జరిగింది: నమక్కల్​కు చెందిన మఖిల్మతి (25).. చెన్నైలోని జామ్​బజార్​​ కన్నభన్​ స్ట్రీట్​లో ఉంటూ సివిల్స్​కు సన్నద్ధమవుతోంది. నుంగంబాక్కంలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్​లో శిక్షణ తీసుకుంటోంది. జూన్ 9న తన బాయ్​ఫ్రెండ్​ రాజ్​కుమార్​.. ఆమె ఇంటికి వచ్చి అక్కడే ఉన్నాడు. అదే రోజు సాయంత్రం తరగతులను ముగించుకొని ఇంటికి వచ్చిన మఖిల్మతి.. తలుపులకు తాళం వేసి ఉండటాన్ని గుర్తించింది. రాజ్​కుమార్​కు ఫోన్​ చేసినా అతడు స్పందించలేదు.

దీంతో ఆందోళన చెందిన మఖిల్మతి.. బాల్కనీలోని వెనుక డోర్​ ద్వారా లోనికి వెళ్లాలని భావించింది. అందుకోసం టెర్రస్​ పైనుంచి మూడో అంతస్తులోని బాల్కనీకి చీరను తాడుగా వాడాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో చీరను పట్టుకొని దిగుతుండగా అనూహ్యంగా అది చిరిగిపోయింది. దీంతో ఆమె కిందపడి అక్కడికక్కడే చనిపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు.. మఖిల్మతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రాజ్​కుమార్​ను ప్రశ్నించారు.

"రాజ్​కుమార్​ అడయార్​లో ఉంటూ ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. తన స్వగ్రామం వెళ్లేందుకు బస్టాండ్​లో దించడం కోసం మఖిల్మతి అతడిని ఇంటికి పిలిచింది. సాయంత్రం ఆమె ఇంటికి వచ్చేసరికి.. అలసట కారణంగా అతడు నిద్రపోయాడు. దీంతో తలుపు తట్టినా అతడికి వినపడలేదు. ఈ ఘటనపై ముమ్మరం చేశాం" అని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: యువతి దారుణ హత్య.. మూడు ఇళ్లు దగ్ధం.. ఆ కారణంతోనే 20 మంది కలిసి!

Last Updated :Jun 11, 2022, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.