ETV Bharat / bharat

కరోనా విలయం: ఒక్కరోజే 1,68,912 కేసులు

author img

By

Published : Apr 12, 2021, 9:51 AM IST

దేశంలో రెండో దశ కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్తగా 1,68,912 మందికి వైరస్​ సోకింది. కొవిడ్​ బారినపడిన వారిలో మరో 904 మంది ప్రాణాలు కోల్పోయారు.

corona cases in india
కరోనా విలయం : ఒక్కరోజే 1,68,912 మందికి కరోనా

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రోజువారి కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయానికి ఏకంగా 1,68,912 మంది కొవిడ్​ బారినపడ్డారు. వైరస్​ ధాటికి మరో 904 మంది బలయ్యారు. కొవిడ్​ సోకిన వారిలో మరో 75,086 మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 1,35,27,717
  • మొత్తం మరణాలు: 1,70,179
  • కోలుకున్న వారు: 1,21,56,529
  • యాక్టివ్​ కేసులు: 12,01,009

దేశవ్యాప్తంగా ఒక్కరోజే 11లక్షల 80 వేల 136 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 10కోట్ల 45 లక్షల 28వేల 565​ డోసుల్ని పంపిణీ చేసినట్టు తెలిపింది.

ఇదీ చదవండి: 'సుప్రీం'పై కరోనా పంజా- మళ్లీ వర్చువల్​గా విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.