ETV Bharat / bharat

సొంతూళ్లకు వలస కూలీల పయనం.. ఆ భయంతోనే?

author img

By

Published : Apr 11, 2021, 2:13 PM IST

Updated : Apr 11, 2021, 4:17 PM IST

కరోనా విజృంభిస్తున్న వేళ మహమ్మారిని అరికట్టేందుకు కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ లాక్​డౌన్​ ప్రకటించే అవకాశం ఉండొచ్చన్న సంకేతాలు.. వలస కూలీలను కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో సొంతూళ్లకు వెళ్లేందుకు ముంబయిలోని లోకమాన్య తిలక్ టెర్మినస్​తో పాటు, ఔరంగాబాద్​ రైల్వేస్టేషన్​కు వలస కూలీలు పోటెత్తారు.

Laborer's returning to home from Maharashtra
మహారాష్ట్రను వీడుతున్న వలస కూలీలు.. ఆ భయంతోనే?

లాక్​డౌన్​ భయాలతో రైల్వేస్టేషన్లలో భారీగా గుమిగూడిన ప్రయాణికులు

కరోనా భయాలతో సొంతూళ్లకు పయనవుతున్నారు మహారాష్ట్రలోని వలస కూలీలు. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న కఠిన ఆంక్షలతో ఇబ్బంది పడుతున్న వీరంతా లాక్​డౌన్​ విధిస్తే పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందనే ఆలోచనలో ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వలస వచ్చిన అనేక మంది కార్మికులు తమ గ్రామాలకు వెళ్లేందుకు లోకమాన్య తిలక్ టెర్మినస్​తో పాటు.. ఔరంగాబాద్ రైల్వేస్టేషన్​కు చేరుకున్నారు. లాక్​డౌన్ విధిస్తే ​వీరిపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉన్నందున.. భయంతో ఇళ్లకు తిరిగి వెళ్తున్నట్లు తెలిపారు.

Laborer's returning to home from Maharashtra
ఔరంగాబాద్​ రైల్వేస్టేషన్​కు భారీగా చేరుకున్న ప్రయాణికులు
Laborer's returning to home from Maharashtra
పెద్ద పెద్ద బ్యాగులను భారంగా ఈడ్చుకుంటూ రైల్వేస్టేషన్​కి
Laborer's returning to home from Maharashtra
తమ సామాన్లన్నీ తీసుకొని ప్రయాణానికి సిద్ధమైన వలస కూలీలు
Laborer's returning to home from Maharashtra
చిన్న పిల్లలతో పడిగాపులు పడుతోన్న తల్లులు
Laborer's returning to home from Maharashtra
ప్రయాణ టికెట్ల కోసం బారులు తీరిన వలస కార్మికులు

వేరే దారిలేకే..

ఇప్పటికే కొందరు ఉపాధి కోల్పోయారు. మరికొందరి దుకాణాలు మూతపడ్డాయి. ఇది ఇలాగే కొనసాగి తమవద్ద ఉన్న కొద్దిపాటి డబ్బూ అయిపోతే తినడానికి తిండి దొరకదని.. అందుకే సొంత గ్రామాలకు వెళ్తున్నామని కొందరు కార్మికులు తెలిపారు.

Laborer's returning to home from Maharashtra
టికెట్లు పొందేందుకు తమ వంతుకోసం ఎదురుచూపులు
Laborer's returning to home from Maharashtra
భారీగా తరలి వచ్చిన ప్రయాణికులు

గత సంవత్సరం మాదిరిగా మళ్లీ లాక్​డౌన్​ విధిస్తే ఇరుక్కుపోతామని.. సొంత గ్రామాలకు వెళ్లాల్సిందిగా తమ యజమానులు సూచించారని వారు అంటున్నారు. భుజాలపై పెద్ద సంచులతో బయలుదేరిన వీరిలో యూపీ, బిహార్, రాజస్థాన్​లకు చెందిన కూలీలు అనేక మంది ఉన్నారు.

''ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే లాక్​డౌన్​ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భయపెడుతున్నారు. ఇప్పటికే ఖడక్ ఎస్టేట్స్‌లో వ్యాపార కార్యకలాపాలు మూసేశారు. దానిపై ఆధారపడే నాలాంటి కార్మికుల ఉద్యోగం పోయింది. రాబోయే రోజుల్లో ఏం తినాలి? ఎలా జీవించాలి? అందుకే స్వగ్రామానికి బయలుదేరా.''

-ఓం ప్రకాశ్​ మిశ్రా, వలస కూలీ.

ఇవీ చదవండి: కరోనా ఉగ్రరూపం: ఒక్కరోజే లక్షా 52 వేల కేసులు

కరోనాపై ఇది రెండో పెద్ద యుద్ధం: మోదీ

కరోనా విజృంభణతో కఠిన ఆంక్షల్లోకి దేశం!

'పరిస్థితి తీవ్రం.. ఇళ్లలోంచి బయటకు రావొద్దు'

Last Updated : Apr 11, 2021, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.