ETV Bharat / bharat

చిన్నారిపై అత్యాచారం.. టీచర్​కు 29ఏళ్ల జైలు శిక్ష!

author img

By

Published : Sep 26, 2021, 10:37 PM IST

లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ ఉపాధ్యాయుడికి 29 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. 'అతను చేసిన నేరం అమానుషమని.. వివేకాన్ని పంచే గురువును జ్ఞాన స్వరూపంగా పరిగణిస్తారని' తీర్పు సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.

Kerala teacher
Kerala teacher

ఒకటో తరగతి చదువుతున్న చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఓ టీచర్‌కు ఏకంగా 29 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది కేరళలోని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్​కోర్టు. ఆరేళ్ల చిన్నారిపై ఉపాధ్యాయుడు పాల్పడిన వికృత చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది.

ఇదీ జరిగింది..

2012లో విద్యార్థులను స్టడీ టూర్‌కి తీసుకెళ్లిన సమయంలో ఆరేళ్ల చిన్నారిపై ఓ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. టీచర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చిన్నారి తన తల్లిదండ్రులకు వివరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై విచారణ జరుపుతున్న ఫాస్ట్​ట్రాక్​ కోర్టు.. లైంగిక వేధింపులు అనాగరికమని పేర్కొంది.

'గురువు ఒక స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శి, సామాజిక ఇంజనీర్, దేశాన్ని నిర్మించేవాడు. భారతీయ తత్వశాస్త్రంలో గురువుకు అత్యున్నత స్థానం ఉంది. సమాజంపై విస్తృతంగా ప్రభావం చూపే ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని పంచుతాడు. జీవిత విలువలను బోధిస్తాడు. మార్గనిర్దేశం చేస్తాడు. దేశాన్ని నిర్మించగలడు' అని తన కోర్టు తీర్పులో పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.