ETV Bharat / bharat

కేరళ స్థానిక పోరులో అధికార ఎల్​డీఎఫ్​ జోరు

author img

By

Published : Dec 16, 2020, 11:24 AM IST

Updated : Dec 16, 2020, 3:21 PM IST

kerala-local-body-polls-counting-of-votes-begins-at-244-centres
కేరళ స్థానిక పోరులో ఎల్​డీఎఫ్​ ముంజంజ

15:20 December 16

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వామపక్ష కూటమి హవా

  • కేరళలో 6 మున్సిపల్‌ కార్పొరేషన్లలో నాలుగింట లెఫ్ట్ ఆధిక్యం
  • రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ కూటమి ముందంజ
  • తిరువనంతపురం, ఎర్నాకులం, కొల్లాం, కోజికోడ్‌లో లెఫ్ట్‌ ఆధిక్యం
  • కన్నూర్‌, త్రిస్సూర్‌లో కాంగ్రెస్ కూటమి ముందంజ
  • కేరళ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 202 వార్డుల్లో లెఫ్ట్‌ విజయం
  • కేరళ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 115 వార్డుల్లో కాంగ్రెస్‌ కూటమి గెలుపు
  • కేరళ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 56 వార్డుల్లో ఎన్డీఏ విజయం
  • కొచ్చి కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్థి వేణుగోపాల్‌ ఒక్క ఓటుతో ఓటమి
  • భాజపా అభ్యర్థి చేతిలో ఒక్క ఓటు తేడాతో వేణుగోపాల్‌ ఓటమి

14:23 December 16

కేరళ స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు..

  • మున్సిపాలిటీలు, బ్లాక్ పంచాయతీలు, జిల్లా పరిషత్‌లకు ఓట్ల లెక్కింపు
  • కేరళలో 6 మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • ఐదు కార్పొరేషన్లలో వామపక్షాలు, ఒకచోట కాంగ్రెస్‌ కూటమి ఆధిక్యం
  • కేరళ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 149 వార్డుల్లో ఎల్​డీఎఫ్​ విజయం
  • కేరళ కార్పొరేషన్‌ ఎన్నికల్లో యూడీఎఫ్‌ 79, ఎన్​డీఏ 42 వార్డుల్లో విజయం
  • కొచ్చి కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్థి వేణుగోపాల్‌ ఒక్క ఓటుతో ఓటమి
  • భాజపా అభ్యర్థి చేతిలో ఒక్క ఓటు తేడాతో వేణుగోపాల్‌ ఓటమి

13:13 December 16

  • ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్​ ప్రకారం తిరువనంతపురం కార్పొరేషన్​లో ఎల్​డీఎఫ్​-7, ఎన్​డీఏ-3, యూడీఎఫ్​-1 చోట విజయం సాధించాయి.
  • ఎల్​డీఎఫ్​-21, యూడీఎఫ్​-4, ఎన్​డీఏ-14 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
  • ఎల్​డీఎఫ్​ మేయర్​ అభ్యర్థి ఎన్​డీఏ అభ్యర్థి ముందు 145 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

12:51 December 16

కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం కొనసాగుతోంది. ఫలితాల్లో ప్రధాన రాజకీయ కూటములైన ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌, ఎన్డీయేల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. వామపక్షాల నేతృత్వంలోని అధికార ఎల్‌డీఎఫ్‌ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 941 గ్రామపంచాయతీల్లో 456 చోట్ల ఎల్‌డీఎఫ్‌ ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి 378 గ్రామపంచాయతీల్లో ఆధిక్యంలో ఉంది. భాజపా 30చోట్ల ముందంజలో కొనసాగుతోంది. 

కన్నూర్‌ కార్పొరేషన్‌లో భాజపా అభ్యర్థి విజయం సాధించారు. తిరువనంతపురంలో ఎల్‌డీఎఫ్‌, ఎన్డీయే మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇక ఎర్నాకుళంలో కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్థి కేవలం ఒకే ఒక్క ఓటుతో ఓటమిపాలవడం గమనార్హం. యూడీఎఫ్‌ తరఫున ఎర్నాకుళం మేయర్‌ బరిలో ఉన్న కేఎన్‌ వేణుగోపాల్‌.. భాజపా అభ్యర్థి చేతిలో ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయారు. ఫలితాల్లో వేణుగోపాల్‌కు 181 ఓట్లు రాగా.. భాజపా అభ్యర్థి పద్మాకుమారి 182 ఓట్లతో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థి రీకౌంటింగ్‌ కోరారు. కోచిలో యూడీఎఫ్‌, ఎల్‌డీఎఫ్‌ మధ్య గట్టి పోటీ నెలకొంది. 

కేరళలోని మొత్తం 1200 స్థానిక సంస్థల్లోని 21,893 వార్డులు, 6 కార్పొరేషన్లు, 941 గ్రామ పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు, 87 మున్సిపాలిటీలకు ఈ నెల 8 నుంచి మూడు దశల్లో పోలింగ్‌ జరిగింది. బుధవారం ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. 2015లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో ఎల్‌డీఎఫ్‌ విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. మరికొద్ది నెలల్లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

12:08 December 16

ఎల్​డీఎఫ్​ దూకుడు..

  • కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిక్యంలో అధికార వామపక్ష కూటమి
  • మున్సిపాలిటీలు, బ్లాక్ పంచాయతీలు, జిల్లా పరిషత్‌లకు ఓట్ల లెక్కింపు
  • కేరళలో 6 మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • నాలుగు కార్పొరేషన్లలో వామపక్షాలు, రెండింటిలో కాంగ్రెస్‌ కూటమి ఆధిక్యం
  • కేరళ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 84 వార్డుల్లో ఎల్​డీఎఫ్​ విజయం
  • కేరళ కార్పొరేషన్‌ ఎన్నికల్లో యూడీఎఫ్‌ 52, ఎన్​డీఏ 28 వార్డుల్లో విజయం

11:55 December 16

హోరాహోరీ పోరు..

కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రాథమిక సమాచారం మేరకు గ్రామపంచాయతీ, బ్లాక్ పంచాయతీ, కార్పొరేషన్లు, జిల్లా పంచాయతీల్లో అధికార ఎల్​డీఎఫ్​ కూటమి అధిక్యంలో దూసుకుపోతోంది. మున్సిపాలిటీల్లో ఎల్​డీఎఫ్​, యూడీఎఫ్​ల మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. 

11:30 December 16

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..

  • కేరళలో కొనసాగుతున్న స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు
  • మున్సిపాలిటీలు, పంచాయతీలు, జిల్లా పరిషత్‌లకు ఓట్ల లెక్కింపు

కేరళలో 6 మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

  • నాలుగు కార్పొరేషన్లలో వామపక్షాలు, రెండింటిలో కాంగ్రెస్‌ కూటమి ఆధిక్యం
  • కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిక్యంలో అధికార వామపక్ష కూటమి

మొత్తం 152 బ్లాక్‌ పంచాయతీల్లో ఎల్​డీఎఫ్​ 93, యూడీఎఫ్‌ 56 స్థానాల్లో ఆధిక్యం

  • కేరళ: మొత్తం 14లో 11 జడ్పీల్లో ఎల్​డీఎఫ్​, 3 జడ్పీల్లో యూడీఎఫ్‌ ఆధిక్యం
  • అలెప్పీ, మలప్పురం, వాయనాడ్‌ జడ్పీల్లో కాంగ్రెస్‌ కూటమి ఆధిక్యం
  • కొచ్చి కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్థి వేణుగోపాల్‌ ఒక్క ఓటుతో ఓటమి
  • భాజపా అభ్యర్థి చేతిలో ఒక్క ఓటు తేడాతో వేణుగోపాల్‌ ఓటమి

కేరళ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 42 వార్డుల్లో ఎల్డీఎఫ్‌ విజయం

కేరళ కార్పొరేషన్‌ ఎన్నికల్లో యూడీఎఫ్‌ 31,  ఎన్​డీఏ 17 వార్డుల్లో విజయం

కేరళ పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంలో ఎల్​డీఎఫ్​ 

  • ఎర్నాకుళం, కన్నూరు కార్పొరేషన్‌లో స్వల్ప ఆధిక్యంలో యూడీఎఫ్‌ కూటమి
  • కొల్లాం, కోజికోడ్‌, త్రివేండ్రం కార్పొరేషన్లలో అధికార ఎల్డీఎఫ్‌ ఆధిక్యం
  • త్రిశూర్‌ కార్పొరేషన్‌లో ఎల్​డీఎఫ్​, యూడీఎఫ్‌ మధ్య పోటాపోటీ

11:16 December 16

కేరళ స్థానిక పోరులో ఎల్​డీఎఫ్​ ముందంజ

కేరళ స్థానిక పోరులో ఎల్​డీఎఫ్​ ముందంజ..

  • కేరళలో కొనసాగుతున్న స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు
  • మున్సిపాలిటీలు, పంచాయతీలు, జిల్లా పరిషత్‌లకు ఓట్ల లెక్కింపు
  • కొచ్చి కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్థి వేణుగోపాల్‌ ఒక్క ఓటుతో ఓటమి
  • భాజపా అభ్యర్థి చేతిలో ఒక్క ఓటు తేడాతో వేణుగోపాల్‌ ఓటమి
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార ఎల్​డీఎఫ్​ ఆధిక్యం
  • కేరళ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార ఎల్​డీఎఫ్​ ఆధిక్యం
  • 108 వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న ఎల్​డీఎఫ్
  • కేరళ కార్పొరేషన్‌ ఎన్నికల్లో యూడీఎఫ్‌ 59, ఎన్​డీఏ 36 వార్డుల్లో ఆధిక్యం
  • కేరళ పంచాయతీ, పురపాలక ఎన్నికల్లోనూ అధికార ఎల్​డీఎఫ్​ ఆధిక్యం
Last Updated : Dec 16, 2020, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.