ETV Bharat / bharat

Karnataka Minister CID Investigation : 'లంచం ఆరోపణల' కేసులో కన్నడ మంత్రిపై సీఐడీ విచారణ

author img

By

Published : Aug 8, 2023, 7:00 PM IST

CID Probe On Karnataka Agriculture Department Minister
Karnataka Agriculture Minister Bribery CID Case

Karnataka Minister CID Investigation : అధికారులను లంచం కోసం వేధిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి చెలువరాయస్వామిపై సీఐడీ విచారణకు ఆదేశించింది సిద్ధరామయ్య ప్రభుత్వం.

Karnataka Minister CID Investigation : కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి చెలువరాయస్వామిపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసును సీఐడీకి అప్పగించింది అక్కడి ప్రభుత్వం. స్వయంగా ఆ రాష్ట్ర మంత్రే.. లంచం కోసం వ్యవసాయశాఖ అధికారులను వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే సంబంధిత లేఖ నకిలీదని తొలుత కొట్టిపారేసిన ప్రభుత్వమే.. తాజాగా మంత్రిపై సీఐడీ విచారణకు ఆదేశించడం గమనార్హం.

Karnataka Agriculture Minister CID Case : ఈ లంచం ఆరోపణల వ్యవహారాన్ని కొందరు ఉన్నతాధికారులు గవర్నర్‌ థావర్​ చంద్​ గెహ్లోత్​ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రిపై ఫిర్యాదు చేస్తూ ఆయనకు ఓ లేఖ కూడా రాశారు. వ్యవసాయశాఖకు చెందిన జాయింట్‌ డైరెక్టర్లు తనకు ప్రతినెలా రూ.6 నుంచి రూ.8లక్షల చొప్పున లంచం ఇవ్వాలని ఆ శాఖ ఉద్యోగులను మంత్రి చెలువరాయస్వామి కోరినట్లుగా ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై మండ్య జిల్లా వ్యవసాయశాఖకు చెందిన ఏడుగురు అసిస్టెంట్‌ డైరెక్టర్లు గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తూ రాసినట్లు ఉన్న ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఇలాంటి అవినీతి సంప్రదాయాన్ని నియంత్రించకుంటే తమ కుటుంబాలతో కలిసి ఆత్మహత్యలు చేసుకుంటామని బాధితులు హెచ్చరించినట్లుగా ఆ లేఖలో రాసి ఉంది. కాగా, ఆ లేఖను చీఫ్‌ సెక్రటరీ వందితా శర్మకు పంపించిన గవర్నర్‌.. దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోవాలని సూచించారనే వార్తలు గుప్పుమన్నాయి.

'లేఖ నకిలీదీ'..: ముఖ్యమంత్రి
Karnataka Agriculture Minister Chaluvarayaswamy CID Case : ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించి సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖ నకిలీదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. బీజేపీతో పాటు వారి మిత్రపక్షమైన జేడీఎస్‌ రెండూ కావాలనే దానిని సృష్టించాయని ఆరోపించారు. అయినప్పటికీ వ్యవసాయశాఖ మంత్రిపై వచ్చిన లంచం ఆరోపణలకు సంబంధించి హోంమంత్రి డాక్టర్​ జి.పరమేశ్వరతో కలిసి చర్చించిన అనంతరం ఈ కేసును సీఐడీ( Karnataka Minister Bribery Case )కి అప్పగించాలని సీఎం ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా వెల్లడించింది. అంతకుముందు ఇదే విషయంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి చెలువరాయస్వామి మాట్లాడారు. ఆ లేఖ నకిలీదని, దానిని ఏ అధికారి రాయలేదని వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ తనతో చెప్పారని ఆయన అన్నారు.

ఇటీవలే కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్​ ప్రభుత్వంపై వచ్చిన ఈ అవినీతి ఆరోపణలు అక్కడి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ఒకవేళ అది నకిలీదే అయితే గవర్నర్‌ ఎందుకు స్పందిస్తారని ప్రశ్నించాయి. ఇలా అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రిని స్వయంగా ముఖ్యమంత్రే వెనకేసుకురావడం సిగ్గుచేటని మండిపడ్డాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.