ETV Bharat / bharat

'కూటమిలో ఎవరున్నారో తెలుసుకునేందుకే అవిశ్వాసం'.. ప్రతిపక్షాలపై మోదీ సెటైర్

author img

By

Published : Aug 8, 2023, 12:03 PM IST

Updated : Aug 8, 2023, 1:04 PM IST

Narendra Modi No Confidence Motion : తమ వెంట ఎవరున్నారు, ఎవరు లేరని వారిని వారే పరీక్షించుకునేందుకే.. లోక్​సభలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. విపక్ష ఇండియా కూటమిలో పరస్పర అపనమ్మకాన్ని అవిశ్వాస తీర్మానం ప్రతిబింబిస్తోందని ఆయన వాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముందు భాజపా పార్లమెంటరీ కమిటీ సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

narendra-modi-no-confidence-motion-pm-modi-takes-dig-at-opposition-alliance-ahead-of-no-confidence-motion
కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం మోదీ వ్యాఖ్యలు

Narendra Modi No Confidence Motion : విపక్ష ఇండియా కూటమిలోని పరస్పర అపనమ్మకాన్ని అవిశ్వాస తీర్మానం ప్రతిబింబిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తమ వెంట ఎవరున్నారు, ఎవరు లేరని వారిని వారే పరీక్షించుకుంటున్నారని తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా లోక్​సభలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ జరగనున్న నేపథ్యంలో.. దానిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై చర్చించేందుకు అధికార భాజపా పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. దిల్లీలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా కేంద్రమంత్రులు, భాజపా ఎంపీలు పాల్గొన్నారు. ఇండియా కూటమి ఆరోపణలను ఎలా తిప్పి కొట్టాలన్న దానిపై చర్చ జరిగింది. దాంతో పాటు ఎగువ సభలో దిల్లీ సర్వీస్ బిల్​ ఆమోదం పొందటంపై బీజేపీ రాజ్యసభ సభ్యులను మోదీ అభినందించారు.

  • #WATCH | Delhi | Parliamentary Party meeting of the BJP is underway. Prime Minister Narendra Modi is also present at the meeting.

    Discussion on the No Confidence Motion will begin in Lok Sabha today. pic.twitter.com/61Cagjela5

    — ANI (@ANI) August 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

BJP Parliamentary Party Meeting Today : 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజ్యసభలో జరిగిన 'దిల్లీ బిల్లు' ఓటింగ్‌ను సెమీఫైనల్‌గా కొందరు ప్రతిపక్ష సభ్యులు అభివర్ణించారన్న మోదీ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపుపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలకు ముందు.. చివరి బంతిని సిక్సర్లు బాదాలని తమ పార్టీ ఎంపీలకు ఆయన సూచించారు. 'ప్రతిపక్ష నేతలు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. కానీ వారి కుటుంబ, బుజ్జగింపు, అవినీతి రాజకీయాలే దేశానికి ప్రమాదం. దేశంలో వీటిని రూపుమాపాలి." అని మోదీ వ్యాఖ్యానించారు. తాము మూడవసారి చేపట్టే ప్రభుత్వంలో ఎంపీలు రైల్వే ప్రాజెక్ట్​ల కోసం ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదన్నారు మోదీ. ప్రస్తుతం జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులపై ఆ శాఖ మంత్రి అశ్వీనీ వైష్ణవ్​ ఇచ్చిన ప్రజెంటేషన్​ ఆ విషయాన్ని ధృవీకరిస్తోందని తెలిపారు.

ఎందుకు అవిశ్వాసం ప్రవేశపెట్టారో అర్థం కావట్లేదు..
Arjun Ram Meghwal New Law Minister : బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం మాట్లాడిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్​రామ్ మేఘ్వాల్.. సభలో తమ పార్టీకి పూర్తి మెజార్టీ ఉందని అయినా విపక్ష కూటమి అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టిందో అర్థం కావట్లేదన్నారు. వారి కూటమి ఐక్యంగా ఉందో లేదో అని పరీక్షించుకోవడం కోసం ఇలా చేయవచ్చన్నారు. రాజ్యసభలోనూ విపక్ష కూటమికి బలం లేదనే విషయం.. సభ్యుల ప్రసంగాలలోనే వెల్లడైందన్నారు. దిల్లీ సర్వీస్​ బిల్​ ఓటింగ్​లో తాము పొందవలసిన దాని కంటే ఎక్కువ ఓట్లు పొందామని ఆయను గుర్తు చేశారు.

Opposition No Confidence Motion 2023 : 'మణిపుర్‌ అంశంపై ప్రధాని మౌనవ్రతం పాటిస్తున్నారు'.. అవిశ్వాసంపై లోక్​సభలో చర్చ

రాజ్యసభలో వాగ్వాదం.. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియెన్​ సస్పెండ్​

Last Updated : Aug 8, 2023, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.