ETV Bharat / bharat

'ప్రేమ గుడ్డిది.. కానీ కుటుంబాన్ని బాధించేలా ఉండొద్దు'

author img

By

Published : Jun 15, 2022, 6:54 AM IST

high court love is blind
high court love is blind

High court on Love marriage: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి యోగక్షేమాలను ఆమె తల్లిదండ్రులు తెలుసుకునే అధికారం ఉంటుందని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది. పిల్లల కోసం తల్లిదండ్రులు అనేక త్యాగాలు చేస్తారని పేర్కొంది. యువతీ యువకుల మధ్య ప్రేమ.. తల్లిదండ్రులను బాధించేలా ఉండకూడదని హితవు పలికింది.

Karnataka HC on Love marriage: ప్రేమ గుడ్డిదని.. తల్లిదండ్రులు, సమాజం కన్నా ప్రేమే దృఢమైదని ప్రేమికులు భావిస్తుంటారని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇంజినీరింగ్‌ చదువుతున్న తన కుమార్తె నిసర్గను, ఒక డ్రైవరు నిఖిల్‌ అలియాస్‌ అభి అపహరించుకు వెళ్లాడని ఆరోపిస్తూ ఆమె తండ్రి టి.ఎల్‌.నాగరాజు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. నిసర్గ, నిఖిల్‌ ఇద్దరినీ పోలీసులు ధర్మాసనం ముందుకు తీసుకొచ్చారు. ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్‌ బి.వీరప్ప, జస్టిస్‌ కె.ఎస్‌.హేమలత పైవ్యాఖ్యలు చేశారు.

High Court love is blind: ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నా.. కుమార్తె యోగక్షేమాలు విచారించే అధికారం తల్లిదండ్రులకు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తాను మేజర్‌ను అని, ఇద్దరం ఇష్టపడి మే 13న వివాహం చేసుకున్నామని నిసర్గ తెలిపింది. 'పలువురు తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం జీవితాలను, సుఖాలను త్యాగం చేశారని చరిత్ర చెబుతోంది. ఇద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయతలు ఉన్నా.. అవి కుటుంబాన్ని బాధించేలా ఉండకూడదు. ప్రేమికులు తమ కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఇలాంటి సమస్యలు తలెత్తవు' అని న్యాయమూర్తులు స్పందించారు. ఇప్పుడు కుటుంబాన్ని వదిలి వెళ్తే, భవిష్యత్తులో మళ్లీ తల్లిదండ్రుల అవసరం వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలని నిసర్గకు ధర్మాసనం హితవు పలికింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.