ETV Bharat / bharat

అలహాబాద్​ సీజేగా జస్టిస్​ సంజయ్​ యాదవ్!​

author img

By

Published : May 21, 2021, 7:22 AM IST

యూపీ అలహాబాద్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ సంజయ్​ యాదవ్​ పేరును సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వీ.రమణ అధ్యక్షతన సమావేశమైన కొలీజియం ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది

Sanjay Yadav, Allahabad High court CJ
సంజయ్ యాదవ్​, అలహాబాద్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఉత్తర్​ప్రదేశ్​ అలహాబాద్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్​ సంజయ్​ యాదవ్​ను సుప్రీం కోర్టు కొలీజియం గురువారం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వీ.రమణ అధ్యక్షతన సమావేశమైన కొలీజియం ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

కొలీజియంలో సభ్యులైన జస్టిస్​ ఆర్​.ఎఫ్​.నారిమన్​, జస్టిస్​ యు.యు.లలిత్​ ఈ భేటీలో పాల్గొన్నారు. జస్టిస్​ సంజయ్​ యాదవ్​ ప్రస్తుతం.. అలహాబాద్​ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.

ఇదీ చదవండి: 'రాజీవ్ హత్య కేసు దోషులను విడుదల చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.