ETV Bharat / bharat

సరిహద్దుల్లో ఉద్రిక్తత- భారీ చొరబాట్లకు ఉగ్రమూకల యత్నం, తిప్పికొట్టిన ఆర్మీ

author img

By PTI

Published : Dec 23, 2023, 11:12 AM IST

Updated : Dec 23, 2023, 12:02 PM IST

Jammu Kashmir Army News
Jammu Kashmir Army News

Jammu Kashmir Infiltration : భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి. వారిపై కాల్పులు జరిపి తరిమికొట్టాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతిచెందాడు.

Jammu Kashmir Infiltration : జమ్ముకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్​లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఉగ్రవాదులు చేసిన భారీ కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. చిమ్మచీకట్లో చొరబాటుకు యత్నించిన ఉగ్ర ముష్కరులను తరిమికొట్టాయి. ఈ మేరకు ఆర్మీ అధికారులు శనివారం వెల్లడించారు.

  • #WATCH | J&K: White Knight Corps foiled an infiltration bid in the IB sector of Khour, Akhnoor. A suspected move of four terrorists was seen through the surveillance devices on the night of December 22-23. The terrorists were brought down after effective fire. https://t.co/jzlUVHAeoe pic.twitter.com/LJvvotrgHv

    — ANI (@ANI) December 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అఖ్నూర్‌లోని ఖోర్‌ సెక్టార్‌లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు ముష్కరులు భారీ ఎత్తున ఆయుధాలతో అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు యత్నించారు. నిఘా పరికరాల సాయంతో ఉగ్రవాదులను గుర్తించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే వారిపై కౌంటర్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ముష్కరులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. భద్రతా దళాలు కాల్పులతో ఉగ్రవాదులు వెనక్కి పారిపోయారని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ మృతదేహాన్ని మిగతా ముష్కరులు తమతో పాటు లాక్కెళ్లినట్లు తెలిపారు. కాగా జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో ఇటీవల జరిగిన భీకర ఉగ్రదాడి వేళ ఉగ్రవాదుల చొరబాటు ఘటన కలకలం రేపింది.

రెండు రోజుల క్రితం పూంఛ్‌ జిల్లాలో జవాన్లను తరలిస్తున్న సైనిక వాహనాలపై పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భద్రతా బలగాలు ముమ్మర వేట సాగిస్తున్నాయి. మరోవైపు, పూంఛ్‌ సెక్టార్‌లో దాదాపు 25 నుంచి 30 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి దాదాపు 300 మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇటీవల బీఎస్‌ఎఫ్‌ ఐజీ అశోక్‌ యాదవ్‌ వెల్లడించారు. ముష్కరులు భారత్​లోకి అక్రమంగా చొరబాటుకు వేచి చూస్తున్నారని ఆయన తెలిపారు.

జమ్ముకశ్మీర్‌లో గత కొంతకాలంగా ఉగ్రవాదుల చొరబాటు ఘటనలు తగ్గుముఖం పట్టినప్పటికీ అడపాదడపా పర్వత ప్రాంతాలు, అడవుల గుండా ముష్కరులు సరిహద్దును దాటేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారిని బీఎస్‌ఎఫ్‌ దళాలు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాయి. మరోవైపు, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు కూడా తగ్గినట్లు ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌ వేదికగా తెలిపారు. పదేళ్ల క్రితంతో పోలిస్తే కశ్మీర్‌లో ఉగ్రదాడుల ఘటనలు 70శాతం, పౌర మరణాలు 72శాతం, భద్రతా దళాల మరణాలు 59శాతం తగ్గుముఖం పట్టాయని అమిత్ షా వెల్లడించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

దాడి చేసిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ వేట- రంగంలోకి NIA- పాక్ కుట్రలపై నిపుణుల హెచ్చరిక

దెబ్బకు దెబ్బ- ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతం- కీలక స్నైపర్ ఉగ్రవాది సైతం!

Last Updated :Dec 23, 2023, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.