ETV Bharat / bharat

ఐదేళ్లలో 50ఉపగ్రహాల ప్రయోగం- ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక ప్రకటన

author img

By PTI

Published : Dec 29, 2023, 7:29 AM IST

Updated : Dec 29, 2023, 8:22 AM IST

ISRO Upcoming Missions
ISRO Upcoming Missions

ISRO Upcoming Missions : రాబోయే అయిదేళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. భారీ స్థాయిలో శాటిలైట్‌లను ప్రయోగించగలిగితే దేశానికి ముప్పును తగ్గించొచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

ISRO Upcoming Missions : భౌగోళిక నిఘా సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుచుకునే దిశగా భారత్​ అడుగులు వేస్తోంది. ఇందుకోసం రాబోయే అయిదేళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ వెల్లడించారు. మహారాష్ట్రలోని ముంబయిలో ఐఐటీ బాంబే గురువారం నిర్వహించిన 'టెక్‌ఫెస్ట్‌' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లో పొరలుగా మోహరించడం ద్వారా బలగాల కదలికలపై నిశితంగా కన్నేసి ఉంచొచ్చని ఇస్రో ఛైర్మన్ ఎస్​. సోమనాథ్ తెలిపారు. వేల కిలోమీటర్ల వైశాల్యంలో పర్యవేక్షణ కొనసాగించొచ్చని పేర్కొన్నారు. మార్పులను గుర్తించేలా ఉపగ్రహాల సామర్థ్యాలను మెరుగుపరచడం, డేటా విశ్లేషణకు కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించడం కీలకమని వెల్లడించారు. భారీ స్థాయిలో శాటిలైట్‌లను ప్రయోగించగలిగితే దేశానికి ముప్పును తగ్గించొచ్చని వ్యాఖ్యానించారు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబరులో ప్రతిపాదించిన 'జీ20' ఉపగ్రహానికి పేలోడ్‌లు, సాధనాలు అందించడం ద్వారా తమవంతు సహకారం అందించాలని జీ20 కూటమి సభ్యదేశాలకు సోమనాథ్‌ పిలుపునిచ్చారు. రానున్న రెండేళ్లలో దాన్ని ప్రయోగిస్తామని తెలిపారు.

జనవరి 6న గమ్యస్థానానికి ఆదిత్య ఎల్​-1
Isro Aditya L1 Mission Reach Date : సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య L1 తన ప్రయాణంలో తుది అంకానికి చేరువైంది. జనవరి 6న సాయంత్రం 4గంటలకు తన గమ్యస్థానమైన లగ్రాంజ్‌ పాయింట్‌కు ఆదిత్య L1 చేరుకుంటుందని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు. ఇటీవల ఓ ఎన్​జీఓ నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన కచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామని చెప్పారు. ఐదేళ్లపాటు భారత్‌ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని ఆదిత్య L1 సేకరిస్తుందన్నారు సోమ్‌నాథ్‌. సూర్యుడిలో వచ్చే మార్పులు మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుందని వెల్లడించారు. అలాగే భారత స్పేస్‌ స్టేషన్‌ను నిర్మించేందుకు ఇస్రో ప్రణాళికను సిద్ధం చేసిందని చెప్పారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated :Dec 29, 2023, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.