ETV Bharat / bharat

ఒకేసారి ఒకరి నుంచి ముగ్గురికి వైరస్!

author img

By

Published : May 4, 2021, 5:38 PM IST

రెండో దశ వైరస్‌ మొదటి దశ కంటే రెండు నుంచి రెండున్నర రెట్లు అధిక ప్రభావవంతమైనదని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్), బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిర్వహించిన పరిశోధన ద్వారా ఈ విషయాలు తెలిశాయి.

కరోనా సెకండ్​ వేవ్, coronavirus second wave in india
కరోనా వైరస్​ సెకండ్​ వేవ్

దేశంలో కరోనా రెండో దశ విలయం సృష్టిస్తోంది. ప్రతిరోజు 3 లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. కాగా రెండో దశ వైరస్‌ మొదటి దశ కంటే రెండు నుంచి రెండున్నర రెట్లు అధిక ప్రభావవంతమైనదని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వైరస్‌ వ్యాపిస్తుందని సదరు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్), బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిర్వహించిన పరిశోధన గణాంకాలు ఈ విషయాలను పేర్కొంటున్నాయి. 'ఈ రెండో దశలో అనేక మంది వైరస్‌ బారిన పడుతున్నారు. కొత్త వేరియంట్‌ ఎంత ప్రమాదకరమో పెరుగుతున్న కేసులు, మరణాలే నిదర్శనం' అని టీఐఎఫ్ఆర్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ సందీప్‌ జునేజా వెల్లడించారు.

ముంబయిలో పరిస్థితిపై పరిశోధన..

ముంబయిలో కరోనా మరణాలు అధికంగా నమోదవడానికి కారణాలను పరిశోధిస్తున్నామని సర్వే తెలిపింది. మహారాష్ట్రలో రెండో దశ వైరస్‌ ఫిబ్రవరి నెలలోనే వ్యాప్తి చెందిందని.. లోకల్‌ రైళ్లను తిరిగి ప్రారంభించడం వల్ల అది విజృంభించిందని పేర్కొంది. మే మొదటి వారంలో ముంబయిలో మరణాలు అధికంగా ఉంటాయని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా కొనసాగితే జూన్‌ 1 నాటికి మరణాల సంఖ్య తగ్గుతుందని సర్వే తెలిపింది.

దేశంలో సోమవారం ఒక్కరోజే 3,57,229 మందికి వైరస్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 3,449 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా మొత్తంగా ఇప్పటివరకు దేశంలో 2,22,408 మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో సోమవారం ఒక్కరోజే 48,621 మందికి వైరస్‌ సోకగా, 567 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి : నిశ్చితార్థం రోజునా శ్మశానంలో విధులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.