ETV Bharat / bharat

భారత తొలి సీడీఎస్​ రావత్​కు మరణానంతరం పద్మవిభూషణ్​

author img

By

Published : Jan 25, 2022, 9:34 PM IST

indias-first-cds-gen-bipin-rawat-awarded-padma-vibhushan-posthumously
భారత తొలి సీడీఎస్​ రావత్​కు మరణానంతరం పద్మవిభూషణ్​

Bipin rawat padma vibhushan: భారత్​ తొలి సీడీఎస్​ బిపిన్​ రావత్​ను మరణానంతరం పద్మవిభూషణ్​తో గౌరవించింది కేంద్రం. భారత సైన్యాధ్యక్షుడిగా, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా అత్యుత్తమ సేవలు అందించిన ఆయన స్ఫూర్తిమంతమైన ప్రస్థానాన్ని ఈ సందర్భంగా ఓసారి గుర్తు చేసుకుందాం.

Bipin rawat padma vibhushan: సీడీఎస్​ బిపిన్​ రావత్​ను దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్​తో గౌరవించింది కేంద్రప్రభుత్వం. సైన్యంలో ఆయన అందించిన విశేష సేవలకు గానూ మరణానంతరం ఈ అవార్డు ప్రకటించింది. ​ ఈ సందర్భంగా సైన్యంలో దాదాపు 40 ఏళ్ల సేవలు అందించి, ఎన్నో శిఖరాలను అధిరోహించిన రావత్​ ప్రస్థానాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం.

అపార ప్రతిభాశాలి..

Bipin Rawat Latest News: 1958లో మార్చి 16న ఉత్తరాఖండ్​లో హిందూ గర్వాలీ రాజ్​పుత్ కుటుంబంలో జన్మించారు. ఆయన కుటుంబం తరతరాలుగా సైన్యానికి సేవలు అందిస్తోంది. బిపిన్ తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో పనిచేశారు. ఆయన తల్లి ఉత్తరకాశీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమార్తె.

Bipin Rawat Helicopter: దెహ్రాదూన్​లోని కాంబ్రియన్ హాల్, సెయింట్ ఎడ్వర్డ్స్​ పాఠశాలలో రావత్ విద్యాభ్యాసం చేశారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఖాదక్వాస్ల), ఇండియన్ మిలిటరీ అకాడమీ(దెహ్రాదూన్), వెల్లింగ్టన్​లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్​లో చదువుకున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఆయన ప్రతిభకు 'స్వార్డ్ ఆఫ్ హానర్' అవార్డు లభించింది. అమెరికా కాన్సాస్​లోని యూఎస్ ఆర్మీ కమాండ్​, జనరల్ స్టాఫ్ కాలేజీలో హైయర్ కమాండ్ కోర్స్​ను చేశారు.

నేపాల్ ఆర్మీకీ అధ్యక్షత..!

Bipin Rawat awards: 1978 డిసెంబర్ 16న ఆర్మీలో చేరారు రావత్. తన తండ్రి పనిచేసిన గోర్ఖా రైఫిల్స్​ 11కు చెందిన ఐదో బెటాలియన్​లోనే బాధ్యతలు చేపట్టారు. ఎత్తైన ప్రాంతాల్లో చేసే యుద్ధాల్లో రావత్​కు తిరుగులేదు. పదేళ్ల పాటు తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహించారు. జమ్ము కశ్మీర్​లోని ఉరీలో మేజర్ హోదాలో పనిచేశారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 2016 డిసెంబర్ 17న ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్​గా ఎంపికయ్యారు. ఇద్దరు సీనియర్లను వెనక్కి నెట్టి ఆయన ఈ పదవి దక్కించుకున్నారు. గోర్ఖా బ్రిగేడ్ నుంచి ఆర్మీ చీఫ్​గా ఎదిగిన ముగ్గురు అధికారుల్లో రావత్ ఒకరు. రావత్.. నేపాల్ ఆర్మీకి గౌరవాధ్యక్షులు కూడా.

ఇదీ చదవండి: 'పీఓకే' స్వాధీనానికి భారత సైన్యం సిద్ధం : రావత్​

కీలక మిషన్లు..

చైనాతో 1987లో జరిగిన ఘర్షణలో రావత్ బెటాలియన్ ముందుండి పోరాడింది. 1962 యుద్ధం తర్వాత మెక్​మోహన్ రేఖ వద్ద జరిగిన తొలి సైనిక ఘర్షణ ఇదే. ఈ సమయంలో తన బృందాన్ని సమర్థవంతంగా నడిపించారు రావత్.

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐరాస తరపున నిర్వహించిన మిషన్.. రావత్​ విజయాల్లో చెప్పుకోదగినది. దక్షిణ కివూ రాజధాని గోమాను ఆక్రమించుకునేందుకు సాయుధ తిరుగుబాటు దారులు చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేశారు. దేశవ్యాప్తంగా అస్థిరత, సాయుధ తిరుగుబాటులు నెలకొన్న సమయంలో ఐరాస శాంతిదళాల తరపున పోరాడిన బృందానికి రావత్ అధ్యక్షత వహించారు. మిషన్​లో పాల్గొన్న సైనికుల్లో సగం మంది రావత్ బృందంలో ఉన్నారు. సీఎన్​డీపీ సహా ఇతర సాయుధ తిరుగుబాటుదారులపై దూకుడుగా దాడి చేస్తూనే.. స్థానిక ప్రజల భద్రతకు చర్యలు తీసుకున్నారు. ప్రజలతో సైన్యం మమేకమై, వారి సహకారాన్ని పొందేలా వ్యవహరించారు. నాలుగు నెలల పాటు ఈ ఆపరేషన్ జరిగింది. గోమాను తిరుగుబాటుదారుల వశం కాకుండా కాపాడటమే కాకుండా.. సాయుధ దళాలను చర్చలకు దిగివచ్చేలా చేశారు.

ఇదీ చదవండి: 'దాగుడు మూతలు ఉండవు.. దాటాలనుకుంటే దాటేస్తాం'

మయన్మార్ స్ట్రైక్స్..

2015 జూన్​లో మణిపుర్​కు చెందిన యూఎన్​ఎల్ఎఫ్​డబ్ల్యూ తిరుగుబాటుదారులు భారత సైనికులపై దాడి చేసి 18 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ సమయంలో దిమాపుర్​ కేంద్రంగా పనిచేసే కార్ప్స్​ 3కు కమాండింగ్ అధికారిగా రావత్ వ్యవహరించారు. ఈ ఘటన తర్వాత.. సీమాంతర దాడులతో భారత సైన్యం విరుచుకుపడింది. 21వ బెటాలియన్​కు చెందిన పారాషూట్ రెజిమెంట్.. ఎన్​ఎస్​సీఎన్-కే తిరుగుబాటు సంస్థ స్థావరాన్ని ధ్వంసం చేసింది.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్​గా..

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్​గా 2020 జనవరి ఒకటిన బాధ్యతలు స్వీకరించారు రావత్. గత ఏడాదిన్నరకు పైగా చైనా విసురుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. సైన్యం, ఎయిర్​ఫోర్స్​ మధ్య సమన్వయం మెరుగుపర్చి.. వాస్తవాధీన రేఖ వెంబడి నిఘాను పటిష్ఠం చేసేలా చర్యలు తీసుకున్నారు.

మిలిటరీతో పాటు దౌత్యపరంగానూ విశేష సేవలు అందించారు రావత్. అమెరికా, రష్యా, నేపాల్, శ్రీలంక, మయన్మార్, భూటాన్ తదితర దేశాల్లో పర్యటించారు. ఆయా దేశ అధ్యక్షులు, సైనిక అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించారు. దేశాల మధ్య సైనిక సంబంధాలను బలోపేతం చేయడంలో కృషి చేశారు.

గతేడాది డిసెంబర్​లో తమిళనాడు కూనూర్​ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్​ రావత్​, ఆయన భార్య సహా మొత్తం 14 మంది మరణించారు. ఈ వార్త యావత్​ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి: Padma Awards 2022: పద్మ అవార్డులు వరించింది వీరినే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.