ETV Bharat / bharat

Padma Awards 2022: పద్మ అవార్డులు వరించింది వీరినే..

author img

By

Published : Jan 25, 2022, 8:45 PM IST

Updated : Jan 25, 2022, 9:09 PM IST

Padma Awards 2022: కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించిన సీడీఎస్​ జనరల్ బిపిన్ రావత్​ను మరణానంతరం పద్మవిభూషణ్​తో గౌరవించింది. కరోనా టీకాలు తయారు చేసిన సీరం, భారత్​ బయెటెక్ సంస్థల ఛైర్మన్లకు పద్మ భూషణ్​ అందించనుంది.

Govt announces Padma Awards 2022
పద్మ అవార్డులు

Padma Awards: 2022 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నలుగురికి పద్మ విభూషణ్​, 17మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో వారు చేసిన సేవలకు గానూ ఈ అవార్డులు అందిస్తోంది. సీడీఎస్​ జనరల్​ బిపిన్ రావత్ సహా ఇటీవలి కాలంలో మరణించిన పలువురు ప్రముఖులు ఈ గౌరవం పొందినవారి జాబితాలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల​, గూగుల్​ సీఈఓ సుందర్ పిచాయ్​, కరోనా టీకాలు తయారు చేసిన సీరం, భారత్​ బయోటెక్ సంస్థల ఛైర్మన్​లు సహా ఒలింపిక్స్​లో భారత్​కు బంగారు పతకం తెచ్చిన నీరజ్​ చోప్డాకు పద్మ పురస్కారాలు దక్కాయి.

పద్మ విభూషణ్​ పొందిన వారు

  1. ప్రభ ఆత్రే, మహారాష్ట్ర
  2. శ్రీ రాధేశ్యామ్​ ఖామ్కే(మరణానంతరం), ఉత్తర్​ప్రదేశ్​
  3. జనరల్​ బిపిన్ రావత్​(మరణానంతరం), ఉత్తరాఖండ్​.
  4. శ్రీ కల్యాణ్ సింగ్(మరణానంతరం), ఉత్తర్​ప్రదేశ్​

పద్మ భూషణ్​ పొందిన వారిలో ప్రముఖులు..

  • శ్రీ గులాం నబీ ఆజాద్​(జమ్ముకశ్మీర్‌)
  • భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు సంయుక్తంగా పద్మ భూషణ్‌
  • సీరం ఛైర్మన్‌ సైరస్‌ పూనావాలా
  • బుద్ధదేవ్‌ భట్టాచార్య
  • మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల
  • గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు

పద్మశ్రీ పొందిన వారిలో ప్రముఖులు

  • నీరజ్​ చోప్డా
  • ప్రమోద్ భగత్
  • వందన కటారియా
  • సింగర్​ సోనూ నిగమ్​

పద్మ అవార్డులు పొందిన మొత్తం 128 మందిలో 34 మంది మహిళలు, 10 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. 13 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ఫొటోల రూపంలో చూడండి.

Padma Awards 2022
పద్మ అవార్డులు వరించింది వీరినే
Padma Awards 2022
పద్మ అవార్డులు వరించింది వీరినే
Padma Awards 2022
పద్మ అవార్డులు వరించింది వీరినే
Padma Awards 2022
పద్మ అవార్డులు వరించింది వీరినే
Padma Awards 2022
పద్మ అవార్డులు వరించింది వీరినే
Padma Awards 2022
పద్మ అవార్డులు వరించింది వీరినే
Padma Awards 2022
పద్మ అవార్డులు వరించింది వీరినే

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: 73వ గణతంత్ర వేడుకలకు భారతావని సిద్ధం- ప్రత్యేకతలు ఇవే..!

Last Updated : Jan 25, 2022, 9:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.