లోహ్రీ వేడుకల్లో జవాన్లు- నృత్యాలు చేస్తూ సంబరాలు

author img

By

Published : Jan 14, 2022, 6:36 AM IST

Army jawans celebrate Lohri

Army jawans celebrate Lohri: జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వద్ద లోహ్రీ పర్వదినాన్ని సందడిగా జరుపుకున్నారు భారత జవాన్లు. చలిమంటల వద్ద నృత్యాలు చేసి ఉత్సాహంగా గడిపారు.

Army jawans celebrate Lohri: జమ్ముకశ్మీర్​ బారాముల్లాలోని నియంత్రణ రేఖ వద్ద లోహ్రీ వేడుకలను ఘనంగా నిర్వహించారు భారత జవాన్లు. గడ్డకట్టే చలిలోనూ పంజాబీ పాటలకు డాన్సులు వేస్తూ ఉత్సాహంగా గడిపారు. చలి మంటల వద్దకు చేరి సందడి చేశారు.

జమ్ముకశ్మీర్​లోని పూంచ్​ జిల్లాలో లోహ్రీ వేడుకలను బీసీఎఫ్​ సిబ్బంది ఘనంగా జరుపుకున్నాయి. చలి మంటల చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. రబీ పంటలు ఇంటికి చేరిన సందర్భంగా.. ఉత్తరాదిన లోహ్రీ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

బంగాల్​లోని 192వ బెటాలియన్​ సిబ్బంది కూచ్​బెహార్​లో లోహ్రీ పర్వదినాన్ని వేడుకగా జరుపుకున్నారు.

Army jawans celebrate Lohri
కూచ్​బెహార్​లో లోహ్రీ వేడుకలు

ఇదీ చూడండి: ప్రజలకు ప్రధాని మోదీ లోహ్రీ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.