Covid cases in India: దేశంలో కొత్తగా 12,428 కరోనా కేసులు

author img

By

Published : Oct 26, 2021, 9:45 AM IST

covid

భారత్​లో కొత్తగా 12,428 కరోనా కేసులు (Covid cases in India) నమోదయ్యాయి. 356 మంది ప్రాణాలు కోల్పోగా.. 15,951 మంది వైరస్​ను జయించారు.

దేశంలో రోజువారి కరోనా కేసులు (Coronavirus update) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 12,428 కరోనా కేసులు (Coronavirus update) నమోదయ్యాయి. వైరస్​​ ధాటికి (Covid cases in India) మరో 356మంది ప్రాణాలు కోల్పోగా.. 15,951 మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 34,202,441
  • ‬మొత్తం మరణాలు: 4,55,068
  • మొత్తం కోలుకున్నవారు: 3,35,83,318
  • యాక్టివ్ కేసులు: 1,63,816

పరీక్షలు

సోమవారం ఒక్కరోజే 11,31,826 కరోనా​ పరీక్షలు (Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ పేర్కొంది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 60,19,01,543గా నమోదైంది.

టీకా పంపిణీ

టీకా పంపిణీకొత్తగా 64,75,733 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,02,94,01,119కి చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు..

ప్రపంచవ్యాప్తంగా (coronavirus worldwide) కొత్తగా 3,35,244 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కొవిడ్​​ ధాటికి మరో 5,292 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,48,15,858కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,69,991కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 48,771 మందికి వైరస్​ సోకగా.. మరో 510 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో కొత్తగా 37,930 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజే 1,069 మంది చనిపోయారు.
  • బ్రిటన్​లో కొత్తగా 36,567 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. 38 మంది మృతి చెందారు.
  • టర్కీలో కొత్తగా 27,663 మంది వైరస్​ బారిన పడగా.. 232 మంది మరణించారు.
  • బ్రెజిల్​లో కొత్తగా మరో 5,797 మందికి కొవిడ్ సోకింది. 202 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి : మధ్యప్రదేశ్​లో కరోనా కొత్త రకం- డెల్టా కంటే డేంజరా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.