ETV Bharat / bharat

దేశంలో మరో 16,752 మందికి కరోనా

author img

By

Published : Feb 28, 2021, 9:31 AM IST

దేశంలో తాజాగా 16,752 మందికి కొవిడ్​ సోకినట్టు తేలింది. మొత్తం బాధితుల సంఖ్య 1కోటీ 10లక్షల 96వేల 731కి చేరింది. వైరస్​​ బారినపడిన వారిలో మరో 11,718 మంది కోలుకున్నారు.

INDIA REGISTERED 16,752 NEW COVID-19 POSITIVE CASES AND 113 DEATHS IN LAST 24 HOURS
దేశంలో 1.57 లక్షలు దాటిన కరోనా మరణాలు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 16,752 మందికి కొవిడ్​​​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 113 మంది కరోనా​తో ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 1,10,96,731
  • మరణాలు: 1,57,051
  • రికవరీల సంఖ్య: 1,07,75,169
  • యాక్టివ్​ కేసులు: 1,64,511

వైరస్​ సోకిన వారిలో 11,718 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్త రికవరీ రేటు మరోసారి తగ్గి.. 97.10కి చేరింది. మరణాల రేటు స్థిరంగా 1.42 శాతంగా ఉంది.

దేశవ్యాప్తంగా మరో 58,719 మందికి కొవిడ్​ టీకా అందించినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1కోటీ 43లక్షలు దాటినట్టు పేర్కొంది.

ఇదీ చదవండి: టీకా ప్రాధాన్య జాబితాలో డౌన్‌ సిండ్రోమ్‌ బాధితులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.