ETV Bharat / bharat

'ఆ విషయంలో చైనాపై ఓ కన్నేసి ఉంచాలి'

author img

By

Published : Jul 25, 2021, 8:35 PM IST

Bipin Rawat visited Dras Sector
బిపిన్​ రావత్​

మయన్మార్‌లో చైనా చొచ్చుకు రావడంపై చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ స్పందించారు. చైనా చర్యలపై భారత్‌ ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. కష్టాల్లో ఉన్న మయన్మార్‌ను చైనా బీఆర్‌ఐ ప్రాజెక్టులోకి తీసుకొచ్చి లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

మయన్మార్‌లో చైనా చొచ్చుకు రావడంపై భారత్‌ ఓ కన్నేసి పెట్టాలని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ సూచించారు. ఒక సంస్థ ఏర్పాటు చేసిన వెబినార్‌లో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు తర్వాత అంతర్జాతీయ ఆంక్షలు విధించారు. కష్టాల్లో ఉన్న మయన్మార్‌కు బీఆర్‌ఐ ప్రాజెక్టులోకి తీసుకొస్తోందని రావత్‌ తెలిపారు. మయన్మార్‌లో వేగంగా సాధారణ పరిస్థితి రావడం భారత్‌కు, ఈ ప్రాంతానికి చాలా అవసరమని తెలిపారు. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన ప్రదేశాలతో కలిపే సిలిగురి కారిడార్‌ మయన్మార్‌కు అత్యంత సమీపంలో ఉండటంతో చైనా దీనిపై దృష్టిపెట్టిందని వ్యాఖ్యానించారు.

ఆ ప్రాంతంలో ఒక్క చైనానే కాదు.. ఇంకా పలు రకాల ఇబ్బందులున్నట్లు రావత్‌ పేర్కొన్నారు. సరిహద్దుల్లో సరైన అడ్డంకులు లేకపోవడంతో అక్రమ వలసదార్లు, వేర్పాటువాదులు, మాదకద్రవ్యాల సరఫరాకు కేంద్రగా మారిందని చెప్పారు. ఈ ప్రాంతం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలు అప్రమత్తంగా ఉండటంతోపాటు.. భారత్‌ పొరుగుదేశాలు, అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరమైన సహకారాన్ని కూడా తీసుకోవాలని సీడీఎస్‌ తెలిపారు. అక్కడ నిర్వహించిన వేర్పాటువాద వ్యతిరేక ఆపరేషన్లతో కొంత శాంతి నెలకొందని వివరించారు. వేర్పాటు వాదులకు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, మియన్మార్‌లు కూడా ఇటీవల కాలంలో ఆశ్రయం ఇవ్వడంలేదన్నారు.

సరిహద్దుల్లో సమీక్ష..

కార్గిల్​జిల్లా ద్రాస్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ సందర్శించారు. కార్గిల్ విజయ్ దివాస్‌కు ఒక రోజు ముందు భద్రతా పరిస్థితులపై సమీక్షించారు. కార్గిల్ విజయ్ దివాస్ 22వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ సోమవారం ద్రాస్​లో పర్యటించనున్నారు.

Bipin Rawat visited Dras Sector
ద్రాస్ నియంత్రణ రేఖ వద్ద బిపిన్ రావత్
Bipin Rawat visited Dras Sector
సిబ్బందితో సమావేశమైన బిపిన్​ రావత్​

ఇదీ చూడండి: ఆ అజెండాతోనే భారత్​కు అమెరికా విదేశాంగ మంత్రి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.