ETV Bharat / bharat

India Covid cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

author img

By

Published : Dec 8, 2021, 9:33 AM IST

INDIA COVID CASES
దేశంలో కరోనా కేసులు

India Covid cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 8,439 ‬ మందికి వైరస్ సోకినట్లు తేలింది. కొవిడ్ కారణంగా మరో 195 మంది ప్రాణాలు కోల్పోయారు.

India Covid cases: దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మంగళవారంతో పోలిస్తే భారీగా పెరిగింది. కొత్తగా 8,439 ‬మందికి వైరస్ సోకినట్లు తేలింది.

India Covid deaths:

కరోనాతో మరో 195 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో మరో 9,525 మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 34,656,822
  • మరణాలు: 4,73,952
  • యాక్టివ్ కేసులు: 93,733
  • కోలుకున్నవారు: 3,40,89,137

Vaccination in India:

దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. మరో 73,62,000 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,29,54,19,975కు చేరినట్లు చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 5,98,586 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఒక్కరోజే 7,718 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 267,370,716కు చేరింది. మరణాల సంఖ్య 5,286,114కు పెరిగింది.

  • US covid cases: అమెరికాలో కొత్తగా 1,07,642 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,722 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • Germany covid cases: జర్మనీలో కొత్తగా 51,592 మంది కరోనా బారినపడినట్లు తేలింది.. 448 మంది మహమ్మారితో మృతిచెందారు.
  • France covid cases: ఫ్రాన్స్​లో 59,019 కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి. 172 మంది మరణించారు. 20,102 మంది కోలుకున్నారు.
  • UK covid cases: బ్రిటన్​లో కొత్తగా 45,691 కొవిడ్ కేసులు నమోదుకాగా.. 180 మంది చనిపోయారు.
  • Russia covid cases: రష్యాలో కొత్తగా 31,096మందికి వైరస్​ నిర్ధరణ అయింది. వైరస్​ ధాటికి మరో 1,182 మంది మృతిచెందారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.