భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి.. 558 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు

author img

By

Published : Dec 7, 2021, 9:29 AM IST

india covid cases

India Covid cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజువారీ కేసుల సంఖ్య 558 కనిష్ఠానికి చేరుకుంది. కొత్తగా 6,822‬ మందికి వైరస్ సోకినట్లు తేలింది.

India Covid cases: దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 6,822‬ మందికి వైరస్ సోకినట్లు తేలింది. రోజువారీ కేసుల సంఖ్య 558 రోజుల కనిష్ఠానికి చేరింది.

India Covid deaths:

కరోనాతో మరో 220 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో మరో 10,004 మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 3,46,48,383‬
  • మరణాలు: 4,73,757
  • యాక్టివ్ కేసులు: 95,014
  • కోలుకున్నవారు: 3,40,79,612

Vaccination in India:

దేశంలో టీకా పంపిణీ వేగంగానే కొనసాగుతోంది. మరో 79,39,038 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,28,76,10,590కు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా..

అమెరికా, బ్రిటన్, జర్మనీ సహా వివిధ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. అన్ని దేశాల్లో కలిపి 24 గంటల వ్యవధిలో 4,47,937 కేసులు నమోదయ్యాయి. 5,392 మంది మరణించారు.

  • అమెరికాలో 88 వేలకు పైగా కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 627 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రిటన్​లో 51 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది మరణించారు.
  • జర్మనీలో 39,330 కేసులు నమోదు కాగా.. 309 మంది వైరస్ తీవ్రతకు ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజే 1,184 మంది వైరస్​కు బలయ్యారు. 32 వేల మందికి తాజాగా కొవిడ్ సోకినట్లు తేలింది.

ఇదీ చదవండి: 'తదుపరి మహమ్మారి.. కరోనా కంటే ప్రాణాంతకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.