ETV Bharat / international

'వుహాన్ ల్యాబ్‌ వద్ద శవాల గుట్టలు.. అక్కడి నుంచే కరోనా లీక్​ '

author img

By

Published : Dec 6, 2021, 7:34 AM IST

Trump on wuhan lab: కొవిడ్‌ వ్యాప్తి మొదలైన తొలి నాళ్లలో చైనాలోని వుహాన్‌ ల్యాబ్​ బయట బాడీ బ్యాగ్స్‌ కుప్పలు పడి ఉన్నట్లు ఫొటోలున్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చెప్పారు. ఈ ల్యాబ్​ నుంచే కరోనా వైరస్​ వెలువడి ఉంటుందని ఆరోపించారు.

Trump on wuhan lab
వుహాన్​ ల్యాబ్​పై ట్రంప్​

Trump on wuhan lab: చైనాలోని 'వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ'పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఈ ల్యాబ్​ నుంచే వెలువడి ఉంటుందని చెప్పారు. ఆయన శనివారం 'ది ఆస్ట్రేలియన్‌' అనే వార్తా సంస్థకు చెందిన ఇన్వెస్టిగేటింగ్‌ ఎడిటర్‌ షెర్రీ మార్క్సన్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. 'వాట్‌ రియల్లీ హ్యాపెన్డ్‌ ఇన్‌ వుహాన్‌' అనే కార్యక్రమంలో భాగంగా 30 నిమిషాలపాటు పలు విషయాలను ఆయన మాట్లాడారు.

Trump corona lab leak: కొవిడ్‌ వ్యాప్తి మొదలైన 2020 తొలి నాళ్లలో 'వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ' బయట బాడీ బ్యాగ్స్‌ కుప్పలు పడి ఉన్నట్లు ఫొటోలున్నాయని ట్రంప్​ చెప్పారు. అప్పటికే పరిస్థితి ఘోరంగా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాకపోతే ట్రంప్‌ దీనికి తగిన ఆధారాలను చూపించలేదు. "మీరంతా విన్న కథనాలే నేనుకూడా విన్నాను. వుహాన్‌ వీధుల్లో ప్రజలు పడిపోయి ఉన్నారని, బాడీ బ్యాగ్‌లు తెచ్చారని మీరంతా విన్నట్లే నేను కూడా విన్నాను" అని ట్రంప్‌ వెల్లడించారు.

"ఈ వైరస్‌ ల్యాబ్‌ నుంచి వ్యాపించి ఉంటుందని మన విచక్షణాజ్ఞానం చెబుతుంది. 95శాతం అదే నిజం కావచ్చు. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వెలువడి ఉంటుంది. వారి చెడు ఉద్దేశాలు ఉన్నయా..? లేవా అన్నది నాకుతెలియదు. అది వారి అసమర్థత వల్ల కూడా బయటకు లీకై ఉండొచ్చు. మరేదైనా కానీయండి.. అది వుహాన్‌ ల్యాబ్‌ నుంచే బయటకు వచ్చింది. ఈ విషయాన్ని అమెరికాలో చెబితే వారు.. పిచ్చిగా ప్రవర్తించారు. అలా ఎందుకు ప్రవర్తించారో తెలియదు"

-డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు

షెర్రీ మార్క్సన్‌ను చైనా పత్రికలు గతంలో తీవ్రంగా విమర్శించాయి. 'ల్యాబ్‌ లీక్‌' థియరీని ఆమె ప్రచారం చేస్తోందని చైనాకు చెందిన పీపుల్స్‌ డెయిలీ ఆగస్టులో మండిపడింది. ఆమె కొవిడ్‌ పుట్టుకపై దర్యాప్తును రాజకీయం చేస్తోందని పేర్కొంది. దీనికి అమెరికాలోని రైట్‌వింగ్‌ సర్కిల్‌ను వాడుకొంటోందని పేర్కొంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.