ETV Bharat / bharat

'నందిగ్రామ్​ రణం'లో స్వతంత్రుల ప్రభావమెంత?

author img

By

Published : Mar 23, 2021, 4:09 PM IST

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నా.. యావత్​ దేశం దృష్టి మాత్రం 'నందిగ్రామ్' పైనే. బంగాల్​ సీఎం మమతా బెనర్జీ.. ఒకప్పటి ఆమె సహచరుడు, ప్రస్తుత భాజపా నేత సువేందు అధికారి.. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న క్రమంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇద్దరు దిగ్గజాలు తలపడుతున్న నందిగ్రామ్​లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు స్వతంత్ర అభ్యర్థులు. మరి దిగ్గజ నేతల మధ్య జరుగుతున్న నందిగ్రామ్​ పోరులో స్వతంత్రులు నిలిచి గెలిచేనా?

Independents in Nandigram seat fighting for father's honour, to have a feel of contesting polls
నందిగ్రామ్​ రణం: దిగ్గజ పోరులో స్వతంత్రుల ప్రభావమెంత?

దశాబ్దాల నాటి కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలన్న సంకల్పం ఓ పార్టీది. ప్రత్యర్థుల ఎత్తుగడలను, ప్రజావ్యతిరేకతను ఎదుర్కొని... మూడోసారి అధికార పీఠంపై కొనసాగాలన్న ఆరాటం మరో పార్టీది. ఇలా హోరాహోరీగా సాగుతున్న 'బంగాల్​ దంగల్​'లో 'నందిగ్రామ్​' మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఒకే పార్టీలో సన్నిహితులుగా ఉన్నవారే ప్రత్యర్థులుగా మారడం, మెజార్టీల విషయంలో సవాళ్లు, ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న ప్రతిజ్ఞలు... మమతా బెనర్జీ-సువేందు అధికారి మధ్య పోరును రసవత్తరంగా మార్చాయి. మరి ఈ దిగ్గజాల పోరులో ఇతర చిన్న పార్టీల పరిస్థితేంటి? నందిగ్రామ్​లో పోటీ చేస్తున్న స్వతంత్రుల అసలు లక్ష్యమేంటి? విజయావకాశాలు ఏమాత్రం లేవని తెలిసినా... బరిలో దిగడానికి కారణమేంటి?

నాన్న ప్రతిష్ఠ కోసం..

నందిగ్రామ్​ బరిలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు షేక్​ సద్దాం హుస్సేన్​ బరిలోకి దిగుతున్నారు. ఆయన తండ్రి మహ్మద్​ ఇలియాస్.. గతంలో ఇదే నియోజకవర్గంలో రెండుసార్లు సీపీఐ తరఫున గెలుపొందారు. 2007లో ఒక టీవీ ఛానల్​ నిర్వహించిన శూలశోధన ఆపరేషన్​లో ముడుపులు తీసుకుంటూ ఇలియాస్​ దొరికిపోయారు. ఫలితంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే తన తండ్రిని ఈ కేసులో ఇరికించారని సద్దాం హుస్సేన్​ వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే సద్దాం కొద్దిరోజుల క్రితం సీపీఐని వీడి.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.

Independents in Nandigram seat fighting for father's honour, to have a feel of contesting polls
ఎన్నికల ప్రచారంలో సీపీఎం​ నేత మీనాక్షి ముఖర్జీ

మహాకూటమి నుంచి 'ఆమె'

మహా కూటమి(వామపక్షం-కాంగ్రెస్​-ఐఎస్​ఫ్​) తరఫున సీపీఎం​ నేత మీనాక్షి ముఖర్జీ బరిలోకి దిగారు. 1960 నుంచి నందిగ్రామ్ వామపక్షాలకు​ కంచుకోటగా ఉంది. సీపీఐ దిగ్గజ నేత భూపాల్​ చంద్ర పాండ.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేవారు. కానీ ఈ స్థానాన్ని సీపీఎంకు ఇవ్వాలని సీపీఐ నిర్ణయించింది.

ఇదీ చదవండి : మహాకూటమి నందిగ్రామ్ అభ్యర్థిగా మీనాక్షీ ముఖర్జీ

పాపులారిటీ కోసం..

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న 44 ఏళ్ల దిలీప్ కుమార్ గయేన్​.. ఇలాంటి చారిత్రక నందిగ్రామ్​ సమరంలో తనకంటూ ఏదైనా గుర్తింపు వస్తుందన్న ఉద్దేశంతోనే బరిలోకి దిగుతున్నట్లు చెబుతున్నారు. నామినేషన్ దాఖలు చేయటం తప్ప.. ఎన్నికల ప్రచారం చేసే ఆసక్తి లేదని అంటున్నారు.

Independents in Nandigram seat fighting for father's honour, to have a feel of contesting polls
స్వతంత్ర అభ్యర్థి దిలీప్ కుమార్ గయేన్​

ఇదీ చదవండి : 'సువేందు నామినేషన్‌ రద్దు చేయండి'

చెప్పను బ్రదర్​...

62 ఏళ్ల సుబ్రతా బోస్ సైతం.. నందిగ్రామ్​లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాను భారత పౌరుడ్ని.. తనకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని అంటున్నారు. దీనిపై ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి : 'మమతా బెనర్జీ నామినేషన్​ తిరస్కరించండి'

ఆ కిక్కే వేరప్పా..

నందిగ్రామ్ బరిలో నిలిచిన మరో స్వతంత్ర అభ్యర్థి స్వపన్​ పారూయ్​.. ఎన్నికల్లో పోటీ చేస్తే వచ్చే అనుభూతి కోసమే నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పుకొచ్చారు. దేశానికి సేవ చేయటం కోసమే.. ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు.

ఇదీ చదవండి : బంగాల్​ బరి: 'నందిగ్రామ్' వ్యూహంతో ఎవరికి లాభం?

2006 తరువాత తొలిసారి..

2006 తరువాత నందిగ్రామ్​లో ఈ స్థాయిలో స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయటం ఇదే తొలిసారి. 2006లో సీపీఐ విజయం సాధించినప్పుడు.. ఇద్దరు స్వతంత్రుల్లో ఒకరికి 2,100 ఓట్లు, మరొకరికి 1,300 ఓట్లు దక్కాయి.

'స్వతంత్రుల వెనుక తృణమూల్ హస్తం'

స్వతంత్ర అభ్యర్థుల వెనుక అధికార తృణమూల్​ హస్తం ఉందని సీపీఎం, భాజపా ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాల ఓట్లను చీల్చేందుకు టీఎంసీ యత్నిస్తోందని విమర్శిస్తున్నాయి. అయితే ఆ ప్రయత్నాలేవీ ఫలించవని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ప్రత్యర్థుల ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. ప్రస్తుతం సువేందు సిట్టింగ్​ ఎమ్మెల్యేగా ఉన్నారని.. స్వతంత్రులు బరిలోకి దిగటానికి భాజపానే కారణమని ఎదురుదాడికి దిగింది.

బంగాల్​లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుండగా.. ఎనిమిది దశల్లో పోలింగ్​ జరగనుంది. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఇదీ చదవండి: దీదీపై 50వేల ఓట్ల తేడాతో గెలుస్తా: సువేందు

నందిగ్రామ్​ నుంచే దీదీ సై.. మరి సువేందు?

నందిగ్రామ్​ నుంచే దీదీ పోటీ- 291 సీట్లకు అభ్యర్థులు ఖరారు

బంగాల్ దంగల్: నందిగ్రామ్​లో మళ్లీ ఆనాటి రక్తపాతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.