ETV Bharat / bharat

అక్షరాలు దిద్దించాల్సిన టీచర్..​ ఏం చేసిందంటే?

author img

By

Published : Jul 6, 2021, 9:04 AM IST

కరోనా.. ఎన్నో జీవితాలతో పాటు జీవనోపాధులను కబళించింది. ఉద్యోగాలు చేసుకునేవారిని రోడ్డునపడేసింది. లాక్​డౌన్​ సమయంలో ఎందరో ఉపాధ్యాయులు రోజు కూలీలుగా, కూరగాయాల విక్రయదారుల అవతారమెత్తారు. ఒడిశాలో మాత్రం.. విద్యార్థుల భవితను తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయురాలిని.. చెత్త బండి స్టీరింగ్​ తిప్పే దుస్థితిలో పడేసింది ఈ మహమ్మారి.

teacher driver of waste collection vehicle
ఒడిశా టీచర్

కరోనా కారణంగా చెత్తబండి డ్రైవర్​గా చేస్తున్న టీచర్

'నా ఇద్దరు కూతుళ్లకు తిండి పెట్టలేని దుస్థితి. అత్తమామాల మందులకు ఇబ్బంది అవుతోంది. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించేటప్పుడు కొన్నిసార్లు ఛీత్కారాలు ఎదురవుతాయి.' ఇదీ.. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ఓ టీచర్​ ఆవేదన. ఉపాధ్యాయ వృత్తి నుంచి నగర మున్సిపల్​ కార్పొరేషన్​లో చెత్త బండి డ్రైవర్​గా మారిన స్మృతి రేఖ బెహారా రోదన.

teacher driver of waste collection vehicle
బీఎంసీ డ్రైవర్​గా స్మృతి

ఒడిశాలోని భువనేశ్వర్​కు చెందిన స్మృతి రేఖ.. ఓ నర్సరీ ప్లే స్కూల్​లో బోధించేవారు. భర్త, ఇద్దరు కూతుళ్లు, అత్తమామలతో నగరంలోని పాతబంద మురికివాడలో నివసించేవారు. అప్పటివరకు సాఫీగా సాగుతున్న వారి జీవితం.. కరోనా మహమ్మారితో తలకిందులైంది.

teacher driver of waste collection vehicle
కుటంబంతో స్మృతి రేఖ

అక్షరాలు దిద్దించాల్సిన చేతులు..

కొవిడ్ కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఉన్న హోం ట్యూషన్లను.. కొవిడ్​ నిబంధనల కారణంగా ఆపేయాల్సి వచ్చింది. నిస్సహాయకురాలిగా మారిన స్మృతి రేఖ.. భువనేశ్వర్​ మున్సిపల్​ కార్పొరేషన్(బీఎంసీ)​లో చెత్తబండి డ్రైవర్​ అవతారామెత్తక తప్పలేదు. దీంతో చిన్నారులతో అక్షరాలు దిద్దించాల్సిన ఆమె చేతులు.. పుర వీధుల్లో స్టీరింగ్ తిప్పుతున్నాయి.

teacher driver of waste collection vehicle
చిన్నారులకు చదువు చెబుతున్న స్మృతి

"పాఠశాల, ట్యూషన్​లు మూతపడి నా ఇద్దరు కూతుళ్లకు సరిగ్గా తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం. పొరుగువారి నుంచి చేబదులు తీసుకున్నా ఎక్కువ రోజులు ఇల్లు గడవని దుస్థితి. ఆర్జించడానికి ఈ మహమ్మారి ఏ అవకాశమూ మిగల్చలేదు. నా భర్త కూడా ఉపాధి కోల్పోయారు. ఈ మహమ్మారి సమయంలో నా జీవితంలోనే అత్యంత గడ్డు పరిస్థితులను అనుభవించా."

- స్మృతి రేఖ బెహారా

మూడు నెలల క్రితం డ్రైవర్​ అవతారమెత్తిన స్మృతి.. కరోనా రెండో వేవ్​లో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించాలంటే కఠినంగా ఉండేదని అన్నారు. అయినా కుటుంబ పోషణ కోసం అందుకు సిద్ధమే అని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికురాలిగా చేస్తున్నందుకు తనకు ఎలాంటి భేషజం లేదని, తన పనిని గౌరవిస్తున్నట్లు తెలిపారు.

teacher driver of waste collection vehicle
చెత్త బండి తుడుస్తూ..

ఇదీ చూడండి: నిరుద్యోగ సమస్య తీరాలంటే కావాలీ పట్టణ ఉపాధి హామీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.