ETV Bharat / bharat

గుడ్​ న్యూస్​ చెప్పిన కేంద్ర మంత్రి- తగ్గనున్న పెట్రోల్​ ధరలు!

author img

By

Published : Oct 6, 2021, 4:52 PM IST

hardeep singh puri on petroleum price
భారీగా తగ్గనున్న పెట్రోల్​ ధరలు

త్వరలోనే పెట్రో ధరలు (Oil Price News) భారీగా తగ్గనున్నట్లు కేంద్రమంత్రి హర్​దీప్​ సింగ్​ పురి తెలిపారు. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్​ (OPEC) మార్కెట్​లోకి మరింత ముడి చమురును తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో ఉత్పత్తి పెరుగుతుందని.. ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు.

తగ్గనున్న పెట్రో ధరలు

దేశవ్యాప్తంగా పెట్రో ధరలు (Oil Price News) రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే అవి త్వరలోనే తగ్గనున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి హర్​దీప్ సింగ్ పురి తెలిపారు. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్‌(OPEC) మార్కెట్​లోకి మరింతగా ముడి చమురును తీసుకురావాలని నిర్ణయించినట్లు ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గుర్తుచేశారు. ఈ కారణంగా పెట్రోల్​ రేట్లు తగ్గే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. దీనితో పాటు కేంద్రం కూడా క్రూడ్​ ఆయిల్ నిల్వలను పెంచే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో 2020 మార్చిలో బ్యారెల్ చమురు ధర 19 డాలర్లకు పడిపోయింది. నేడు ఆర్థిక కార్యకలాపాలు యథాతథంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 78 డాలర్లుగా ఉంది. ఈ సమయంలోనే ఒపెక్ దేశాలు​ ముడి చమురును మరింతగా మార్కెట్​లోకి తీసుకురావాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో ఉత్పత్తి పెరిగినప్పుడు చమురు ధరలు తగ్గే అవకాశం ఉంది.

- హర్​దీప్ సింగ్ పురి, పెట్రోలియం శాఖ మంత్రి

గతం కొన్నేళ్లుగా పెట్రోల్​, డీజిల్​ పాటు సీఎన్​జీ ధరలు (Oil Price News) కూడా భారీగా పెరిగాయన్న కేంద్రమంత్రి.. ఇందుకు కారణం యూపీఏ ప్రభుత్వం హయాంలో ధరల పెరుగుదలను నియంత్రించడానికి చేసిన సంతకమే అని దుయ్యబట్టారు. చమురు బాండ్ల కోసం ఎన్​డీఏ ప్రభుత్వం రూ. 20,000 కోట్ల మెచ్యూరిటీ మొత్తాన్ని చెల్లిస్తోందని వివరించారు.

"2010లో యూపీఏ ప్రభుత్వం పెట్రోల్‌ ధరలను క్రమబద్దీకరించలేదు. పెరుగుతున్న ధరలను నియంత్రించడానికి, కాంగ్రెస్ 15 సంవత్సరాల మెచ్యూరిటీ ప్లాన్‌తో రూ. 1లక్ష 40 వేల కోట్ల విలువైన ఆయిల్ బాండ్‌లు జారీ చేసింది. 2020 లో ప్లాన్ మెచ్యూరిటీ తీరిన తరువాత మేము తిరిగి కట్టడం ప్రారంభించాము. దీని కోసం ఏటా మేము ఆ మొత్తంతో పాటు.. వడ్డీని కూడా తిరిగి చెల్లిస్తున్నాము. ఏడాదికి ఈ మొత్తం రూ. 20 వేల కోట్లుగా ఉంది.

కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ.32 మాత్రమే వసూలు చేస్తోంది. ఈ మొత్తంతోనే సుమారు 90 కోట్లమంది పేదలు మూడు పూటలా భోజనం చేయగలుగుతున్నారు. ఇంకా 90 కోట్లకు పైగా మందికి ఉచితంగా టీకాలు పంపిణీ చేశాము. గృహనిర్మాణ పథకం కింద లక్షా 17 వేల ఇళ్లను మంజూరు చేశాము.

పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్​టీ పరిధిలోకి తీసుకువచ్చే విషయాన్ని మండలిలో ప్రస్తావించారు. కానీ రాష్ట్రాలు దీనికి ఓకే చెప్పడానికి సిద్ధంగా లేవు. దీనిపై సంబంధిత ప్రభుత్వాలతో మాట్లాడతాం."

- హర్​దీప్ సింగ్ పురి, పెట్రోలియం శాఖ మంత్రి

ప్రధానమంత్రి ఆవాస్​ యోజన (Pradhan Mantri Awas Yojana) గురించి మాట్లాడిన కేంద్ర మంత్రి హర్​దీప్​ సింగ్​ పురి... ఆ విషయంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించినట్లు చెప్పారు. ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు.. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఇళ్లు నిర్మిస్తారో చెప్పాలని కోరినట్లు పేర్కొన్నారు. ముందుగా కోటి ఇళ్లు నిర్మించాలని భావించినా.. తాము ఇప్పటికే 1 కోటి 13 లక్షల గృహాలకు మంజూరు చేశామని వివరించారు. ఈ మాట చెప్పడానికి తాను గర్వపడుతున్నానని అన్నారు.

"ప్రధాన మంత్రి ఆవాస్ యోజన జూన్ 2015 లో ప్రారంభమైంది. అప్పటి నుంచి యూపీలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఉన్నంత వరకు.. 20వేల ఇళ్లకు మాత్రమే డిమాండ్ ఉన్నట్లు గుర్తించారు అక్కడి అధికారులు. కానీ ఇప్పుడు మేము 11 లక్షల ఇళ్లు నిర్మించాము. మరో 8 లక్షలు మంజూరు చేశాము. యూపీఏ ప్రభుత్వం కేంద్రం అందించే పథకాల కోసం రూ. 1 లక్షా 57 వేల కోట్లు ఖర్చు చేసింది. మోదీ ప్రభుత్వం 2015 జూన్ నుంచి ఇప్పటి వరకు రూ. 11 లక్షల 83 వేల కోట్లు కేంద్ర పథకాల కోసం ఖర్చు చేసింది. ఇది గతంతో పోల్చితే దాదాపు 7 రెట్లు ఎక్కువ."

- హర్​దీప్ సింగ్ పురి, పెట్రోలియంశాఖ మంత్రి

జరిగింది విషాదమే కానీ...

లఖింపుర్​ ఖేరి ఘటనపై (Lakhimpur Kheri News ) కేంద్ర మంత్రి హర్​దీప్ సింగ్ పురి స్పందించారు. అక్కడ జరిగింది కచ్చితంగా విషాదమే అని చెప్పిన ఆయన.. కష్టపడి పనిచేసే రైతులు రాజ్​పథ్​కు రావడానికి తన ట్రాక్టర్‌ను కాల్చుకుంటారని తాను అనుకోవట్లేదని అన్నారు. దీనిపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి.. విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 2045 వరకు చమురే ప్రధాన ఇంధన వనరా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.