ETV Bharat / bharat

రాజ్​నాథ్​, గడ్కరీ సాహసం- హైవేపై విమానం ల్యాండింగ్

author img

By

Published : Sep 6, 2021, 7:46 PM IST

కేంద్ర మంత్రులు రాజ్​నాథ్​, గడ్కరీలు భారీ సాహసానికి సిద్ధపడ్డారు. వైమానిక దళ విమానంలో ప్రయాణిస్తూ.. జాతీయ రహదారిపై అత్యవసర ల్యాండింగ్(plane landing in highway) ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఈ వారమే సాహసం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఎందుకోసం ఈ సాహసం చేస్తున్నారు?

Rajnath, Gadkari
రాజ్​నాథ్​, గడ్కరీ సాహసం

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీలు ఓ పెద్ద సాహసం చేయబోతున్నారు. భారత వైమానిక దళానికి చెందిన విమానంలో ప్రయాణిస్తూ.. రాజస్థాన్​ బర్మెర్​లోని జాతీయ రహదారిపై అత్యవసర​ ల్యాండింగ్ చేయనున్నారు. ఈ వారంలోనే ఈ మాక్​ ల్యాండింగ్​​ ఉంటుందని అధికారులు తెలిపారు(plane landing in highway).

రాజస్థాన్​ బర్మెర్​లోని జాతీయ రహదారిపై వైమానిక దళానికి చెందిన ఫైటర్​ జెట్స్​, ఇతర విమానాలు అత్యవసరంగా దిగడం కోసం 3.5 కిలోమీటర్ల మేర ఎయిర్​స్ట్రిప్​ నిర్మించారు. ఈ ఎయిర్​స్ట్రిప్​ ప్రారంభోత్సవంలో భాగంగానే ఇద్దరు మంత్రులు ప్రయాణిస్తున్న విమానంతో.. మాక్​ ల్యాండింగ్​ చేయనున్నట్లు సమాచారం.

బర్మెర్​ నేషనల్​ హైవే... ఐఏఎఫ్​ ఎయిర్​క్రాఫ్ట్​లు అత్యవసరంగా ల్యాండ్​ అయ్యేందుకు వినియోగించే తొలి జాతీయ రహదారిగా అధికారులు పేర్కొన్నారు.

2017, అక్టోబర్​లో.. లఖ్​నవూ-ఆగ్రా ఎక్స్​ప్రెస్​వేపై ఐఏఎఫ్​కు చెందిన ఫైటర్​ జెట్స్​, ట్రాన్స్​పోర్ట్​ విమానాలు మాక్​ ల్యాండింగ్(fighter plane landing on agra-lucknow expressway)​ నిర్వహించాయి. అత్యవసర పరిస్థితుల్లో అలాంటి రహదారులను ల్యాండింగ్​ కోసం వినియోగించుకోగలమని చూపేందుకు ఈ మాక్​ ల్యాండింగ్​ చేపట్టారు.

జాతీయ రహదారులపై ఎయిర్​స్ట్రిప్స్​ను అభివృద్ధి చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్​హెచ్​ఏఐ) అధికారులు.. ఐఏఎఫ్​ అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. బర్మెర్​ కాకుండా దేశవ్యాప్తంగా ఇంకా 12 జాతీయ రహదారుల్లో ఎయిర్​స్ట్రిప్స్​ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: రాహుల్​ గాంధీ ఒక 'రాజకీయ కోకిల': భాజపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.