ETV Bharat / bharat

Rahul Gandhi: 'అధికారంలోనే పుట్టాను.. దానిపై ఆసక్తి లేదు'

author img

By

Published : Apr 9, 2022, 3:19 PM IST

Updated : Apr 9, 2022, 5:57 PM IST

Rahul Gandhi: తాను అధికారంలోనే పుట్టానని, దానిపై తనకెప్పుడూ ఆసక్తి లేదని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కానీ కొందరు మాత్రం ఎప్పుడూ ఆధికారం కోసం తాపత్రయపడతూ ఉంటారని విమర్శించారు.

Rahul gandhi
RSS

Rahul Gandhi: Rahul Gandhi: తనకెన్నడూ అధికారంపై ఆసక్తి లేదని చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తాను పుట్టిందే అధికారం మధ్యలో అని అన్నారు. దిల్లీలో శనివారం 'ది దళిత్ ట్రూత్​ అనే' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. యూపీ నేత మాయావతి, ఆర్​ఎస్​ఎస్​లపై విమర్శలు గుప్పించారు.

"అధికారం కోసం పరితపించే రాజకీయ నాయకులున్నారు. వారెప్పుడూ దాని గురించే ఆరాట పడతారు. కానీ, నేను పుట్టిందే అధికారం మధ్య. నిజాయతీగా దానిపై నాకు ఎలాంటి ఆసక్తి లేదు. బదులుగా ఈ దేశాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

మాయవతికి సీఎం పదవి ఆఫర్​: ఇటీవలే జరిగిన ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల సందర్భంగా బీఎస్​పీ చీఫ్​ మాయావతితో కూటమి కోసం ప్రయత్నించినట్లు చెప్పారు రాహుల్. ఆమెకు సీఎం పదవి ఆఫర్​ చేయగా.. కనీసం మాట్లాడేందుకు నిరాకరించారని తెలిపారు. "మాయావతి.. ఎన్నికల పోరు చేయలేదు. కాంగ్రెస్​పై ప్రభావం పడినా.. యూపీలో దళితుల కోసం గొంతెత్తారు కాన్షీరాం. కానీ ఈసారి మాత్రం దళితుల కోసం మాయావతి నిలబడలేదు. భాజపాకు ఆమె ఆమోదం తెలిపారు. కారణం.. సీబీఐ, ఈడీ, పెగాసస్​!" అని రాహుల్ విమర్శించారు.

ఆర్ఎస్​ఎస్ చేతుల్లో రాజ్యాంగ సంస్థలు: రాజ్యాంగం.. భారత్​కు ఆయుధమని, అయితే సంస్థలు లేనిదే దానికి అర్ధం లేదని రాహుల్ గాంధీ అన్నారు. "రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం గురించి మాట్లాడుతుంటాం. రాజ్యాంగం ఎలా అమలవుతుంది? సంస్థలతో! రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ముందు మన సంస్థలను రక్షించుకోవాలి. కానీ, అవన్నీ ఆర్​ఎస్​ఎస్ చేతుల్లో ఉన్నాయి." అని ఆరోపించారు రాహుల్.

ఇదీ చూడండి: 'సీబీఐ ఇప్పుడు పంజరంలో చిలుక కాదు'

Last Updated : Apr 9, 2022, 5:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.