ETV Bharat / bharat

గుప్తనిధుల కోసం తండ్రినే బలి ఇవ్వబోయిన కుమారుడు

author img

By

Published : May 1, 2022, 9:37 AM IST

Human Sacrifice In Odisha: వృద్ధుడిని బలి ఇస్తే గుప్తనిధులు దొరుకుతాయనే నమ్మకంతో సొంత తండ్రినే హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. ఈ అమానుష ఘటన ఒడిశాలోని కలహండిలో జరిగింది.

Human Sacrifice In Odisha
Human Sacrifice In Odisha

Human Sacrifice In Odisha: ఒడిశా కలహండిలో అమానుష ఘటన జరిగింది. వృద్ధుడిని బలి ఇస్తే గుప్తనిధులు దొరుకుతాయనే నమ్మకంతో సొంత తండ్రినే హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో స్పందించి వృద్ధుడిని రక్షించారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

కలహండి జిల్లాలోని జైపట్నా బేలపాడ గ్రామానికి చెందిన లింగరాజ్​ భోయ్​(30) అనే యువకుడు చిన్న విషయాలకే తన తండ్రి బాలదేవ్ భోయ్​ను దారుణంగా హింసించేవాడు. దీంతో లింగరాజ్​ భార్య కూడా విడిచిపెట్టి వెళ్లిపోయింది. వృద్ధుడిని బలి ఇస్తే గుప్త నిధులు లభ్యమవుతాయని ఓ పూజారి చెప్పాడు. అది నమ్మిన లింగరాజ్ శుక్రవారం తన తండ్రిని బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. బావి వద్దకు తీసుకవెళ్లి స్నానం చేయించి.. కొత్త బట్టలు తొడిగించి.. పూలదండలు వేసి సిద్ధం చేశాడు. అనంతరం పూజారి ఇంట్లో బలి ఇవ్వడానికి పూజను ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపేందుకు యత్నించగా.. వారిపై ఇనపరాడ్లు, గొడ్డళ్లతో లింగరాజ్​ దాడి చేశాడు. అయితే.. పోలీసులు చాకచక్యంగా అతడ్ని పట్టుకుని స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి: సెక్యూరిటీ గార్డును చెట్టుకు వేలాడదీసి.. ఇనుప రాడ్లతో దాడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.