ETV Bharat / bharat

Household Work Couple : 'ఇంటి పనిని భార్యాభర్తలిద్దరూ సమానంగా చేయాలి!'.. హైకోర్టు వ్యాఖ్యలు

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 7:38 PM IST

Updated : Sep 14, 2023, 7:56 PM IST

Household Work Couple : ఇంటి పని భారాన్ని.. భార్యాభర్తలిద్దరూ సమానంగా మోయాలని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ఇద్దరూ ఉద్యోగాలు చేసినప్పుడు.. ఇంటి పని ఒక్క భార్యే చేయాలనుకోవడం పాత కాలపు మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపింది.

Household Work Couple
Household Work Couple

Household Work Couple : ఆధునిక సమాజంలో ఇంటి పని భారాన్ని.. భార్యాభర్తలిద్దరూ సమానంగా మోయాలని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ఇద్దరూ ఉద్యోగాలు చేసినప్పుడు.. ఇంటి పని ఒక్క భార్యే చేయాలనుకోవడం పాత కాలపు మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపింది. ఓ కేసు నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

అసలేం జరిగిందంటే?
13ఏళ్ల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్న 35 ఏళ్ల వ్యక్తి.. తన భార్య నుంచి విడాకులు కోరుతూ 2018లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య.. ఎప్పుడూ తల్లితో ఫోన్​లో మాట్లాడుతోందని, ఇంటి పనులు చేయడం లేదని కోర్టుకు తెలిపాడు. అయితే పిటిషనర్ వాదనలు విన్న ఫ్యామిలీ కోర్టు.. అతడి పిటిషన్​ను కొట్టివేసింది. కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వ్యులను బాంబే హైకోర్టులో అతడు సవాల్ చేశాడు.

అయితే రోజూ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి పనులన్నీ చేయమని తనను బలవంతం చేశారని సదరు మహిళ హైకోర్టుకు తెలిపింది. తన పుట్టింటి వారితో మాట్లతున్నందుకు వేధింపులకు గురైనట్లు ఆరోపింతచింది. అనేక సందర్భాల్లో తనను శారీరకంగా హింసించాడని కోర్టుకు చెప్పింది.

పిటిషనర్​ దాఖలు చేసిన అప్పీల్​ను న్యాయమూర్తి నితిన్​ సాంబ్రే, షర్మిలా దేశ్​ముఖ్​తో కూడిన డివిజిన్​ బెంచ్​ తోసిపుచ్చింది. అనంతరం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారని.. కేవలం మహిళనే ఇంటి పనులన్నీ భార్య చేయాలని ఆశించడం పాతకాలపు ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుందని బెంచ్ పేర్కొంది. ఆధునిక సమాజంలో ఇంటి బాధ్యతల భారాన్ని భార్యాభర్తలిద్దరూ సమానంగా మోయాలని అభిప్రాయపడింది. వైవాహిక బంధం.. పుట్టింటికి భార్య దూరంగా ఉండేలా చేయకూడదని చెప్పింది. తన తల్లిదండ్రులతో సంబంధాలను తెంచుకునేలా చేయకూడదని పేర్కొంది. బాధితురాలు మానసిక క్రూరత్వాన్నికి గురైందని ఆవేదన వ్యక్తం చేసింది.

'తండ్రి పేరును మార్చలేమన్న హక్కు ఎవరికీ లేదు'
జనన ధ్రువీకరణ పత్రంలో తండ్రి పేరును మార్చలేమని చెప్పే హక్కు దేశంలో ఏ మున్సిపల్​​ కార్పొరేషన్​కు లేదని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భర్త నుంచి విడాకుల తీసుకోకుండానే మరో వ్యక్తితో సహజీవనం చేసిన ఓ మహిళ.. బిడ్డకు జన్మనిచ్చింది. అయితే తన బిడ్డ ధ్రువీకరణ పత్రంలో తండ్రి స్థానంలో భర్త పేరు ఉండడం వల్ల ఆమె మున్సిపల్​ కార్పొరేషన్​ ఆశ్రయించగా.. అందుకు వారు నిరాకరించారు. దీంతో ఆ మహిళ హైకోర్టులో పిటిషన్​ వేసింది.

కేసు నేపథ్యం ఇదీ.. నవీ ముంబయికు చెందిన మహిళ.. ఓ వ్యక్తిని 2017లో వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా 2018 జూన్​ నుంచి వేర్వేరుగా జీవిస్తున్నారు. అయితే 2020 జులైలో ఆమె మరో వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ తర్వాత గర్భం దాల్చింది. అయితే ప్రసవం సమయంలో ఆమె భర్త.. ఆస్పత్రిలో భర్త స్థానంలో తన పేరు రాయించుకున్నాడు. దీంతో ఆస్పత్రి వర్గాలు కూడా.. బిడ్డ ధ్రువీకరణ పత్రంలో అతడి పేరునే ముద్రించింది.

అయితే బిడ్డకు తన భర్త తండ్రి కాదని.. మరో వ్యక్తి అని.. బర్త్​ సర్టిఫికెట్​లో పేరు మార్చాలని నవీ ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​ను మహిళ కోరింది. అందుకు వారు నిరాకరించారు. దీంతో ఆమె బాంబే హైకోర్టను ఆశ్రయించింది. ఆమె పిటిషన్​ను జస్టిస్​ గౌతమ్ పటేల్, జస్టిస్​ కమల్​ ఖాటాతో కూడా డివిజన్​ బెంచ్ విచారించింది. తండ్రి మార్చలేమని చెప్పే హక్కు ఏ మున్సిపల్ కార్పొరేషన్​ లేదని ఉత్తర్వ్యులు జారీ చేసింది.

భర్త ఆస్తిలో భార్యకు సమాన హక్కు.. ఆభరణాలు, చీరలు కేవలం గిఫ్ట్​లే!: హైకోర్టు

తల్లిని చూసుకోని కూతురికి 'ఆమె' ఆస్తిపై హక్కులుండవ్​!: హైకోర్టు

Last Updated : Sep 14, 2023, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.