ETV Bharat / bharat

Horoscope Today (01-10-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

author img

By

Published : Oct 1, 2021, 4:39 AM IST

Updated : Oct 1, 2021, 6:24 AM IST

horoscope
రాశిఫలాలు

Horoscope Today(01-10-2021): ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

ఈరోజు (01-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..


శ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష రుతువు, భాద్రపద మాసం

బహుళపక్షం దశమి: రా. 7.08 తదుపరి ఏకాదశి

పుష్యమి: రా. 12.31 తదుపరి ఆశ్రేష

వర్జ్యం: ఉ. 7.28 నుంచి 9.10 వరకు

అమృత ఘడియలు: సా. 5.41 నుంచి 7.23 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.18 నుంచి 9.07 వరకు తిరిగి మ. 12.20 నుంచి 1.08 వరకు

రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు

సూర్యోదయం: ఉ.5-54

సూర్యాస్తమయం: సా.5-48

మేషం

ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్యమైన పనిని బుద్ధిబలంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. లక్ష్మీ సందర్శనం ఉత్తమం.

వృషభం

ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. తోటివారితో సంతోషంగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో ప్రశాంతంగా వ్యవహరించాలి. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.

మిథునం

మిశ్రమకాలం. ప్రారంభించిన పనిలో బాగా శ్రమించాలి. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలం చాలా అవసరం. ఉత్సాహం తగ్గకుండా ముందుకు సాగాలి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

కర్కాటకం

మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి,ఉద్యోగ వ్యాపారాలలో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. ఇష్టదైవ దర్శనం ఉత్తమం.

సింహం

స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభించినప్పటికీ కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది.

కన్య

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు, నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఇష్టదైవ నామస్మరణ ద్వారా మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి.

తుల

ఏ పని ప్రారంభించినా అది పూర్తయ్యే వరకు పట్టుదల వదలకండి. మనశ్శాంతిని తగ్గించే ఘటనలు చోటుచేసుకుంటాయి. పరిచయం లేని వారిని తొందరగా నమ్మకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈశ్వర సందర్శనం ప్రశాంతత కోసం శుభప్రదం.

వృశ్చికం

మీ మీ రంగాల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. రెచ్చగొట్టే వారు ఉన్నారు. విచక్షణా జ్ఞానంతో ముందుకు సాగండి. మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం.

ధనుస్సు

అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి. సత్పలితాలు సిద్ధిస్తాయి. గొప్ప ఆర్థిక లాభాలు ఉన్నాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తిచేస్తారు. శ్రీ రామ దర్శనం మరింత మేలు చేస్తుంది.

మకరం

అనుకూల సమయం. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తవుతుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఇష్టదైవ దర్శనం శుభప్రదం.

కుంభం

దైవానుగ్రహంతో పనులు పూర్తవుతాయి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. మహాలక్ష్మి దర్శనం శుభకరం.

మీనం

కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. శివ సందర్శనం శుభప్రదం.

Last Updated :Oct 1, 2021, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.