ETV Bharat / bharat

సీఎంగా 12వ తరగతి విద్యార్థి.. గుజరాత్ అసెంబ్లీలో రియల్​ సీన్​

author img

By

Published : Jul 21, 2022, 8:08 PM IST

గుజరాత్​ శాసనసభలో తొలిసారిగా 'యూత్​ మోడల్​ అసెంబ్లీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​, స్పీకర్​ నీమా ఆచార్య.. కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మోక్​ అసెంబ్లీలో పాల్గొన్న యువత
మోక్​ అసెంబ్లీలో పాల్గొన్న యువత

12వ తరగతి విద్యార్థి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. మరొకరు స్పీకర్​, ప్రతిపక్ష నాయకుల హోదాలో కూర్చున్నారు. వీరంతా అసెంబ్లీలో కూర్చుని శాసనసభ వ్యవహరాలు చక్కబెడుతుండగా.. వాదోపవాదాలు చేసే రాజకీయ నాయకులు ఓ పక్కన కూర్చుని చూస్తుండిపోయారు. ఇదంతా ఏదో సినిమాలో జరగలేదండి. గుజరాత్​ అసెంబ్లీలో నిజంగానే జరిగింది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే!

Youth Model Assembly in Gujarat
యూత్​ మోడల్ అసెంబ్లీ
Youth Model Assembly in Gujarat
కార్యక్రమాన్ని ప్రారంభింస్తున్న ముఖ్యమంత్రి

గుజరాత్​ శాసనసభలో అరుదైన దృశ్యం జరిగింది. గుజరాత్​ అసెంబ్లీలో తొలిసారిగా 'యూత్​ మోడల్​ అసెంబ్లీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. అసెంబ్లీ వ్యవహరాలన్నింటినీ యువతే నిర్వహించింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​, స్పీకర్​ నీమా ఆచార్య.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.. యువతను ప్రోత్సహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఈ మాక్​ అసెంబ్లీలో పాల్గొన్నారు. 'గణేశ్​ వాసుదేవ్ మౌళాంకర్​ పార్లమెంటరీ స్టడీస్​ అండ్ ట్రైనింగ్​ బ్యూరో' ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

Youth Model Assembly in Gujarat
మోక్​ అసెంబ్లీలో పాల్గొన్న యువత
Youth Model Assembly in Gujarat
అసెంబ్లీలో ముఖ్యమంత్రి

శాసనమండలి ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఛైర్మన్​ స్థానాన్ని ఖాళీగా ఉంచారు. ఈ మాక్ అసెంబ్లీలో రోహన్​ రావల్​ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించాడు. ఇతడు రావల్​ పట్టణంలోని జైడస్​ పాఠాశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. గౌతమ్​ దవే ప్రతిపక్ష నాయకుడిగా, మిశ్రి షా అసెంబ్లీ స్పీకర్​గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో సురక్షితంగా ఉందన్నారు​.

ఇవీ చదవండి: CCTV Video: పెట్రోల్​ బంక్​లోకి దూసుకొచ్చిన బస్సు

మమత ట్విస్ట్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు టీఎంసీ దూరం.. అదే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.