ETV Bharat / bharat

వరద గుప్పిట్లో హిమాచల్​.. 17 మంది మృతి.. రూ.3వేల కోట్ల నష్టం.. 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా..

author img

By

Published : Jul 10, 2023, 6:34 PM IST

Himachal Pradesh Rains And Floods
వరద గుప్పిట్లో హిమాచల్​.. 17 మంది మృతి.. రూ.3వేల కోట్ల నష్టం.. 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా..

Himachal Pradesh Rains : హిమాచల్‌ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు అక్కడి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన నదులన్ని ఉగ్రరూపం దాల్చాయి. వరదల కారణంగా పలువురు మరణించారు. పెద్ద సంఖ్యలో ఆస్తి నష్టం కూడా జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాబోయే 24 గంటలు ప్రజలందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని.. ఎవరూ బయటకు రావద్దని సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు విజ్ఞప్తి చేశారు.

Floods In Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రావి, బియాస్, సట్లెజ్, స్వాన్, చీనాబ్ సహా అన్ని ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శిమ్లాలో కొండచరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత రెండు రోజుల్లో హిమాచల్‌లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 17కి చేరింది. నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ఉద్ధృతికి ఇళ్లు, భారీ వాహనాలు కొట్టుకుపోతున్నాయి. అనేక రహదారులపై కొండచరియలు విరిగిపడటం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి.

  • #WATCH | Himachal Pradesh: Mandi's Panchvaktra temple has been submerged in water due to a spate in the Beas river following incessant heavy rainfall. pic.twitter.com/sk7wjpbnah

    — ANI (@ANI) July 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

50 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
Himachal Pradesh Rains History : హిమాచల్‌ ప్రదేశ్‌లో కుంభవృష్టి కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైంది. నదులు మహోగ్ర రూపం దాల్చాయి. వరదల ధాటికి అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. ఆకస్మిక వరదల ధాటికి ఇళ్లు, భారీ వాహనాలు కొట్టుకుపోయాయి. పర్యాటక పట్టణం మనాలిలో వరదల్లో చిక్కుకుపోయిన 20 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. వివిధ ప్రాంతాలలో మొత్తంగా 300 మంది వరదల్లో చిక్కుకున్నారని వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. శిమ్లాలోని థియోగ్ సబ్‌డివిజన్‌లో ఉదయం కొండచరియలు విరిగిపడటం వల్ల ముగ్గురు వ్యక్తులు మరణించారు.

రికార్డు స్థాయిలో కురుస్తున్న భారీ వర్షాలకు హిమాచల్ ప్రజలు అల్లాడిపోతున్నారు. గత 48 గంటల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు 20, ఆకస్మిక వరదల ఘటనలు 17 నమోదైనట్లు అధికారులు తెలిపారు. 876 బస్సు మార్గాలు దెబ్బతిన్నాయని, 403 బస్సులు వివిధ ప్రదేశాల్లో నిలిచిపోయాయని హిమాచల్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ప్రకటించింది.

ఆ మార్గం మూసివేత..
Himachal Pradesh Roads Closed : కొండచరియలు విరిగిపడ్డ కారణంగా మొత్తం 765 రోడ్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. 484 నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి. చండీగఢ్-మనాలి జాతీయ రహదారిపై చాలా చోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల అధికారులు రోడ్డును బ్లాక్ చేశారు. సిమ్లా-కిన్నౌర్ రహదారిపై రాళ్లు పడటం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తించిన సిమ్లా-కల్కా మార్గంలో రైలు రాకపోకలను మంగళవారం వరకు నిలిపివేస్తునట్లు అధికారులు తెలిపారు.

సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం..
Himachal Pradesh Weather : మండీ జిల్లా తునాగ్‌లో ఆకస్మిక వరదలు పోటెత్తడం వల్ల ఇళ్లు, వాహనాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. కుల్లూలో లారీలు కూడా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. భారీ రాళ్లు, పెద్దపెద్ద దుంగలు ఈ వరదలో కొట్టుకుపోయాయి. కులుమానాలీలో వరదల ధాటికి భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.

సున్ని ప్రాంతంలో సట్లెజ్ నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తుండడం వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మండీలోని పంచవక్ర్త ఆలయం నీటిలో మునిగిపోయింది. ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండడం వల్ల స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. విక్టోరియా బ్రిడ్డీని తాకుతూ వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హిమాచల్​లో వర్షాకాల సీజన్ లో సాధారణంగా 160 మిల్లీ మీటర్ల సగటు వర్షం నమోదవుతుందని.. కానీ ఈ ఏడాది ఇప్పటికే 271.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వివరించింది.

దయచేసి ఇంట్లోనే ఉండండి.. : సీఎం
Himachal Pradesh CM Meeting : ఉత్తరాది రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్న వేళ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు విజ్ఞప్తి చేశారు. గత యాభై ఏళ్లలో హిమాచల్‌లో ఎప్పుడూ ఈ స్థాయిలో భారీ వర్షాలు కురవలేదని అన్నారు. వరదలు కారణంగా ఇప్పటివరకు దాదాపు 3 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సుఖ్వీందర్‌ తెలిపారు.

  • प्रवासी मजदूरों की सुरक्षा और कल्याण सुनिश्चित करना प्रदेश सरकार की सर्वोच्च प्राथमिकता है। आपदा की इस घड़ी में हमने ऊना में स्थानीय प्रशासन के सहयोग से आपदा से प्रभावित 1100 से अधिक व्यक्तियों को सरकारी और निजी परिसरों में आश्रय प्रदान किया है cont..1 pic.twitter.com/9km8t1GHox

    — CMO HIMACHAL (@CMOFFICEHP) July 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గత రెండు రోజుల్లో హిమాచల్‌లో వరదల కారణంగా 17 మంది మృతి చెందారని.. అందువల్ల ప్రజలందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని సుఖ్వీందర్‌ కోరారు. మనాలిలో వరదల్లో చిక్కుకొన్న 29 మందిని, మండీలో మరో ఆరుగురిని NDRF, పోలీసు బృందాలు సురక్షితంగా రక్షించాయని సుఖు చెప్పారు. లాహౌల్, స్పితి జిల్లాల్లోని వరదల్లో చిక్కుకున్న 4 వందల మంది పర్యాటకులు, స్థానికులను రక్షించే ప్రయత్నాలు జరుగుతోన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలందరూ రాబోయే 24 గంటలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని ఎవరూ బయటకు రావద్దని సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ కోరారు.

  • #WATCH | BJP leader & former Himachal Pradesh CM Jairam Thakur visits Mandi to review the situation as the district is ravaged by flash floods and landslides following incessant rainfall in the state pic.twitter.com/GgH5Up6DN8

    — ANI (@ANI) July 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu heads a review meeting of the State Disaster Management Authority, (SDMA).

    17 people have died in the state till now. The initial estimate of loss ranges between Rs 3000 crore to Rs 4000 crore, CM says.

    Efforts are underway to… pic.twitter.com/HnutuXo8GZ

    — ANI (@ANI) July 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.