ETV Bharat / bharat

లోదుస్తుల్లో గుట్టుగా డ్రగ్స్​ తరలింపు- చివరకు..

author img

By

Published : Jan 22, 2022, 8:47 AM IST

Updated : Jan 22, 2022, 9:09 AM IST

heroin
హెరాయిన్

Heroin Seized: రూ.7 కోట్ల విలువగల హెరాయిన్​ను లోదుస్తుల్లో అక్రమంగా తరలిస్తున్న ఉగాండ దేశస్థుడిని చెన్నైలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. మరో ఘటనలో దుబాయ్​ నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

Heroin Seized: మాదక ద్రవ్యాలను లోదుస్తుల్లో అక్రమంగా రవాణా చేస్తున్న ఉగాండ దేశస్థుడిని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. రూ.7 కోట్ల విలువ గల ఒక కేజీ హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు.

heroin
హెరాయిన్

విమానాశ్రయంలో షార్జా నుంచి వస్తున్న ప్రయాణికుడ్ని (29) ముందస్తు సమాచారంతో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అతని లోదుస్తుల్లో 108 హెరాయిన్ క్యాప్సూల్స్​ను గుర్తించారు. మొత్తం హెరాయిన్ ఒక కేజీ బరువు ఉందని తెలిపారు.

మరో ఘటనలో దుబాయ్​ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ప్రయాణికున్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి బంగారం కడ్డీలు, గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.69.44 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: 'నిందితుల జాబితాలో సోషల్‌మీడియాను ఎందుకు చేర్చట్లేదు?'

Last Updated :Jan 22, 2022, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.