ETV Bharat / bharat

'నిజమైన డిగ్రీలు ఉన్నందుకే వారికి శిక్ష'

author img

By

Published : Mar 17, 2021, 12:52 PM IST

కేంద్రంపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మరోసారి మండిపడ్డారు. నిజమైన డిగ్రీలు ఉన్న కారణంగానే పట్టభద్రులైన యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం శిక్షిస్తోందని ఆరోపించారు.

rahul
'నిజమైన డిగ్రీలు ఉన్నందుకే వారిని శిక్షిస్తున్నారు'

ఉపాధి అవకాశాలు కల్పించకుండా పట్టభద్రులను కేంద్రం శిక్షిస్తోందని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. ప్రముఖ విద్యా సంస్థల్లో అధ్యాపక పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఈమేరకు ట్వీట్ చేశారు.

  • Educated youth is facing severe joblessness.

    It seems GOI is penalising them, esp. OBC-SC-ST candidates, for having real degrees! pic.twitter.com/nyiUStdgtD

    — Rahul Gandhi (@RahulGandhi) March 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఐఐటీ సహా పలు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో భర్తీ కానీ అధ్యాపకుల పోస్టుల వివరాలను బుధవారం ట్విట్టర్​లో షేర్​ చేశారు రాహుల్. పట్టభద్రులైన యువతపై.. ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలపై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. నిజమైన డిగ్రీలు ఉన్న కారణంగానే కేంద్రం వారిపై ఈ వైఖరి ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు.

ఇదివరకు.. పలువురు భాజపా నేతల విద్యార్హతలపై కాంగ్రెస్ సందేహాలను వ్యక్తం చేసింది. కొందరు బోగస్ డిగ్రీ పట్టాలు పొందారని ఆరోపించింది. అదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి : భాజపా ఎంపీ రామ్​ స్వరూప్​ ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.