ETV Bharat / bharat

16వేల హార్ట్ సర్జరీలు చేసిన డాక్టర్​కు గుండెపోటు.. 41ఏళ్లకే మృతి

author img

By

Published : Jun 7, 2023, 6:22 PM IST

Updated : Jun 7, 2023, 6:50 PM IST

Gaurav Gandhi Heart Attack : గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వేలాది మందికి చికిత్స చేసి, కాపాడిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ గౌరవ్ గాంధీ ఆకస్మికంగా మరణించారు. 41ఏళ్ల వయసులోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

Gaurav Gandhi Heart Attack
Gaurav Gandhi Heart Attack

Gaurav Gandhi Heart Attack : 16వేల మందికి గుండె శస్త్రచికిత్సలు చేసి, మరెన్నో వేల మందికి మెరుగైన వైద్యం అందించిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ గౌరవ్ గాంధీ గుండెపోటుతో మరణించారు. మంగళవారం ఉదయం గుజరాత్​లోని జామ్​నగర్​లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

41 ఏళ్ల గౌరవ్ గాంధీ సోమవారం యధావిధిగా జామ్​నగర్​లోని తన ఆస్పత్రిలో రోగులకు చికిత్స అందించారు. సాయంత్రం ప్యాలెస్ రోడ్​లోని ఇంటికి వెళ్లారు. రాత్రికి భోజనం చేసి, నిద్రపోయారు. ఆ సమయంలో ఆయన ఇబ్బంది పడుతున్నట్లుగా ఎలాంటి సూచనలు కనిపించలేదు. మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు డాక్టర్ గౌరవ్ గాంధీని నిద్రలేపేందుకు వెళ్లారు. అయితే ఆయన అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే గౌరవ్​ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

గౌరవ్ గాంధీ జామ్​నగర్​లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తర్వాత అహ్మదాబాద్​లో కార్డియాలజీ కోర్సు చేశారు. స్వస్థలం జామ్​నగర్​కు తిరొచ్చి అక్కడే వైద్యునిగా సేవలు అందించడం ప్రారంభించారు. గుండె సంబంధిత సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తూ వేలాది మందిని కాపాడారు. జామ్​నగర్ ప్రాంతంలో కార్డియాలజిస్ట్​గా మంచి పేరు సంపాదించుకున్నారు.

  • this is peak irony, a renowned cardiologist , Dr. Gaurav Gandhi from Jamnagar has passed away this morning due to a heart attack. If only he could operate himself, life is complex, no-one above Nature, RIP😔💔 pic.twitter.com/Z4mNmNZagJ

    — Aryan Pandey (@imaryan_1828) June 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

హృద్రోగాలతో బాధపడే వారికి చికిత్స అందించడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరంపై విస్తృత ప్రచారం చేసేవారు డాక్టర్ గౌరవ్ గాంధీ. ఫేస్​బుక్​లో హాల్ట్ హార్ట్ ఎటాక్​ అనే పేరుతో ఈ అవగాహనా కార్యక్రమం చేపట్టేవారు. అనేక మంది ప్రాణాలు నిలబెట్టి, వృత్తిపరంగా ఎంతో పేరు సంపాదించుకున్న డాక్టర్ గౌరవ్ గాంధీ అకాల మరణంపట్ల సహచర వైద్యులు, ఆయన దగ్గర చికిత్స తీసుకున్న వారు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు.

  • #BreakingNow #Shocking #News

    Gaurav Gandhi, a renowned cardiologist from Gujarat's Jamnagar, passed away at the age of 41 yrs on Tuesday morning due to a heart attack, reports said. Gandhi had performed operations on around 16,000 individuals throughout his medical tenure. pic.twitter.com/hlEEN7JDeT

    — Advocate_Anish.Sahgal (@Adv_AnishSahgal) June 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Dr. Gaurav Gandhi, a cardiologist who performed 16000 surgeries dies of heart attack at the age of 41.
    Life is uncertain and nobody knows how long we live.
    Om shaanti 🙏 pic.twitter.com/bDQumRfkNf

    — Sonika Sharma (@sonikasdutta) June 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గుండెపోటు రాకుండా ఉండాలంటే..
గుండె సంబంధిత సమస్యలు ఈ మధ్య సాధారణం అయ్యాయి. పిన్న వయసులోనే గుండెపోటు కారణంగా మరణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జీవనశైలిలోని మార్పులే ఇందుకు ప్రధాన కారణం అని వైద్యులు చెప్తున్నారు. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రపోకపోవడం, దురలవాట్ల వల్ల అనేక మంది హృద్రోగాల బాధితులుగా మారుతున్నారు. గుండెపోటు రాకుండా చూసుకునేందుకు వైద్యులు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. జీవనశైలిని కాస్త మార్చుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని అంటున్నారు. వాటిలో కొన్ని..

Last Updated : Jun 7, 2023, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.