ETV Bharat / bharat

Gajwel, Telangana Assembly Election Result 2023 Live : గజ్వేల్​లో కేసీఆర్​ ముందంజ - ఏడు రౌండ్ల వివరాలు ఇవే

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 1:06 PM IST

Updated : Dec 3, 2023, 10:45 PM IST

KCR Gajwal
Gajwel Telangana Assembly Election Result 2023 Live

Gajwel Telangana Assembly Election Result 2023 Live : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగగా, కారు మాత్రం చాలా నెమ్మదిగా వెళ్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఎప్పటిలాగే ఆ పార్టీ అభ్యర్థులు తమ సత్తా చాటుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఆర్​ఎస్ అధినేత కేసీఆర్ ముందంజలో ఉన్నారు.

Gajwel Telangana Assembly Election Result 2023 Live : తెలంగాణ శాసససభ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 30 రోజులు 95 నియోజకవర్గాలను చుట్టుముట్టారు. కానీ కేసీఆర్​కు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం తీర్పును వెలువరిస్తే, గజ్వేల్ ప్రజలు మాత్రం కేసీఆర్​నే కావాలని తీర్పును వెలువరించారు.

ఇప్పటివరకు పూర్తిగా 14 టేబుల్స్​లో 23 రౌండ్లు జరగగా, వీటితో పాటు పోస్టల్ ఓట్లు కలిపి కేసీఆర్​కు 45,031 ఓట్ల మెజారిటీ లభించింది. మొదటి రౌండ్ నుంచి పూర్తి ఆధిక్యతను కనబరిచిన బీఆర్​ఎస్ అధినేత, చివరి 23వ రౌండ్ వరకు కూడా అదే ఊపును కొనసాగించారు. ఈ క్రమంలో కేసీఆర్​కు మొత్తం 1,11,684 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్సారెడ్డికి 32,568 ఓట్లు వచ్చాయి. కేసీఆర్​కు గట్టి పోటీ ఇస్తారని భావించిన ఈటల రాజేందర్ 66,653 ఓట్లు లభించాయి. ఈటలకు హుజురాబాద్​లో కూడా ఓటమి తప్పలేదు.

KCR Loss in Kamareddy Constituency : తెలంగాణ ప్రజానికం మొత్తం ఎంతో ఆసక్తిగా తిలకించిన ఎన్నిక ఏదైనా ఉందంటే అది కామారెడ్డినే. ఈ ఎన్నికలో కేసీఆర్ రెండో స్థానానికే పరిమితం అయ్యారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఈ స్థానంలో బరిలో నిలవడమే ఇందుకు గల ప్రధాన కారణం. కానీ ప్రజలు మాత్రం బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి 5,156 ఓట్ల మెజారిటీతో గెలుపొంది అందరినీ ఆకర్షించారు. ఈయన గెలుపుగల ప్రధాన కారణం స్థానికుడు కావడమే. రేవంత్​రెడ్డి మూడోస్థానానికే పరిమితం అయ్యారు.

Telangana Assembly Election Results 2023 : తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖరారు కాగానే కేసీఆర్​ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి గవర్నర్​కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం తన వ్యక్తిగత వాహనాల్లో ప్రగతిభవన్​ వీడి ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రానికి వెళ్లిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ నుంచి విభజన చెందిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమైన రోజు నుంచి రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్​ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం 2018లో శాసనసభను రద్దు చేసి మళ్లీ ఎన్నికకు వెళ్లి రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. మళ్లీ మూడోసారి సీఎంగా గెలిచి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నారు. కానీ 2023లో ఓటమిపాలై వెనుదిరిగారు. తొమ్మిదిన్నరేళ్లు పాటు కేసీఆర్​ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు.

Last Updated :Dec 3, 2023, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.