ETV Bharat / bharat

డంపింగ్​యార్డులో భారీ అగ్ని ప్రమాదం.. ఇళ్లకు వ్యాపించకుండా..

author img

By

Published : Apr 26, 2022, 10:52 PM IST

Fire Accident: దిల్లీలోని డంపింగ్​ యార్డులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై నివేదిక సమర్పించాలని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్​ రాయ్ అధికారులను ఆదేశించారు.

fire
fire

డంపింగ్​ యార్డులో అగ్ని ప్రమాదం

Fire Accident in Dumping Ground: దిల్లీ భలస్వా ప్రాంతంలోని డంపింగ్​ యార్డులో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. నివాసిత ప్రాంతాల సమీపానే ఈ ప్రమాదం జరగడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు వ్యాపించకుండా కట్టడి చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన పర్యావరణ శాఖ మంత్రి గోపాల్​ రాయ్​.. ప్రమాదానికి గల కారణాలపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్​ యార్డ్​లో వ్యర్థాల నుంచి మీథేన్​ ఉత్పత్తి అవుతుందని.. ఎండాకాలంలో ఈ మీథేన్​ కారణంగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : 'మోదీజీ.. దయచేసి ఇక ఆపేయండి ప్లీజ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.