ETV Bharat / bharat

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ఏపీ వాసులు మృతి

author img

By

Published : Jun 6, 2023, 7:38 AM IST

Updated : Jun 6, 2023, 10:06 AM IST

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం
Road Accident In Karnataka

07:30 June 06

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఏపీ వాసులు మృతి చెందారు.

Five AP People Died in Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రాకు చెందిన ఐదుగురు మృతి చెందగా మరో 13 మంది గాయప డ్డారు. మృతి చెందిన వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ చెందిన వీరు కలబురుగిలోని దర్గా ఉరుసు జాతరకు వెళ్తున్నట్లు తెలిసింది.

ఇంటిల్లిపాది సంతోషంగా జాతరకు వెళ్దమని అనుకుంది ఆ కుటుంబం. పిల్లలకు సెలవులు కావటంతో సరదగా కాలం గడిపి రావచ్చని భావించారు. వేసవి తాపం నుంచి తప్పించుకుని విహరించినట్లు ఉంటుందని ఊహించుకున్నారు. కానీ విధి వారి ఊహలను కాలరాసింది. సంతోషంగా జాతరకు వెళ్దామని అనుకున్న వారికి తీరాన్ని దుఃఖాన్ని మిగిల్చింది. సరదగా గడుపుదామని అనుకున్న వారికి ఆ ప్రయాణం అంతులేని విషాధాన్ని మిగిల్చింది.

కర్ణాటకలో స్థానిక పోలీసులు ప్రాథమికంగా అందించిన సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్​లోని నంద్యాల జిల్లా వెలగోడు గ్రామ వాసులు కర్ణాటకలోని కలబురుగిలో జరుగుతున్న.. దర్గా ఉరుసు జాతరకు క్రూజర్​ వాహనంలో బయలు దేరారు. ఈ క్రమంలో వారు యాదగిరి జిల్లాకు చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం.. ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన వారిలో మునీర్ (40), నయమత్ ఉల్లా (40), మీజా (50), ముద్దాసిర్ (12), సుమ్మి (13) గా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో వాహనంలో 18 మంది ఉండగా.. మిగిలిన 13 మందికి గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులకు సహాయ చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయలైన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులకు ప్రస్తుతం రాయచూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నసైదాపూర్​ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్రూజర్​ వాహనం నడుపుతున్న డ్రైవర్​ తప్పిదమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆగి ఉన్న లారీని క్రూజర్​ వాహనామే ఢీ కొట్టిందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని.. పూర్తి దర్యాప్తు జరిపిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు తెలియవస్తాయని పోలీసులు అన్నారు.

ఇవీ చదవండి :

Last Updated :Jun 6, 2023, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.